ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Seawater Desalination: సముద్రపు నీటి డీశాలినేషన్‌లో ముందడుగు

ABN, Publish Date - May 16 , 2025 | 05:08 AM

సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీవో కీలక విజయం సాధించింది. అధిక పీడనం కలిగిన సముద్రపు నీటి డీశాలినేషన్‌ కోసం స్వదేశీ నానోపోరస్‌ మల్టీలేయర్డ్‌ పాలిమెరిక్‌ మెంబ్రేన్‌ను అభివృద్ధి చేసింది.

  • స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో

  • ఐసీజీ నౌకలోని ప్లాంట్‌లో విజయవంతంగా పరీక్ష

న్యూఢిల్లీ/అల్వాల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీవో కీలక విజయం సాధించింది. అధిక పీడనం కలిగిన సముద్రపు నీటి డీశాలినేషన్‌ కోసం స్వదేశీ నానోపోరస్‌ మల్టీలేయర్డ్‌ పాలిమెరిక్‌ మెంబ్రేన్‌ను అభివృద్ధి చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా భారత తీర రక్షక దళం(ఐసీజీ) అవసరాల కోసం కాన్పూర్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ అయిన డిఫెన్స్‌ మెటీరియల్స్‌ స్టోర్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (డీఎంఎ్‌సఆర్‌డీఈ)లో ఈ సాంకేతికతను రికార్డు స్థాయిలో 8నెలల్లో అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఐసీజీకి చెందిన ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ నౌకలోని డీశాలినేషన్‌ ప్లాంట్‌లో డీఎంఎ్‌సఆర్‌డీఈ నిర్వహించిన ప్రారంభ సాంకేతిక పరీక్షలు విజయవంతమైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ జరిపిన పరీక్షలు సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చాయి. 500గంటల పాటు పరీక్షించిన తర్వాత దీనికి ఐసీజీ తుది ఆమోదం జారీ చేయనుంది. స్వల్ప మార్పుల అనంతరం తీర ప్రాంతాల్లో సముద్రపు నీటి డీశాలినేషన్‌ ప్రక్రియకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 05:08 AM