ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్ర.. ఎర్రకోట వేదికగా మోదీ

ABN, Publish Date - Aug 15 , 2025 | 04:00 PM

దేశీయ సాంకేతికతో వచ్చే పదేళ్లలో మిషన్ సుదర్శన్ చక్రను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నిఘా, సైబర్ ప్రొటక్షన్‌తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు.

PM Modi

న్యూఢిల్లీ: భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా మిషన్ 'సుదర్శన్ చక్ర' (Sudarshan Chakra)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించారు. దేశీయ సాంకేతికతో వచ్చే పదేళ్లలో దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిఘా, సైబర్ ప్రొటక్షన్‌తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యవస్థ శత్రువులు, ఉగ్రవాదాలను నుంచి కీలక ప్రదేశాలను కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురువేసిన అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.

ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్', అమెరికా ప్రతిపాదిత 'గోల్డెన్ డోమ్' తరహాలో ప్రధాని ప్రకటించిన డిఫెన్సివ్ బ్లాంకెట్‌గా 'సుదర్శన్ చక్ర' ఉండనుంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్‌తో సుమారు 100 గంటల సేపు పాక్ క్షిపణులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత్‌ను ఎలాంటి ముప్పునైనా రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

'2035 నాటికి ఈ రక్షణ కవచాన్ని (సుదర్శన్ చక్ర) విస్తరించడం, పటిష్టం చేయడం, ఆధునీకరించడం చేస్తాం. శ్రీకృష్ణుని స్ఫూర్తితో సుదర్శన్ చక్ర మార్గాన్ని ఎంచుకున్నాం. పూర్తి రీసెర్చ్‌తో అభివృద్ధి చేసి, దేశీయంగానే దీనిని రూపొందిస్తాం. ప్రతి పౌరుడు దీనికింద సురక్షితంగా ఉన్నట్టు భావిస్తాడు' అని మోదీ తెలిపారు.

సుదర్శన్ చక్ర ప్రత్యేకతలు

సుదర్శన్ చక్రను బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా రూపొందించనున్నారు. అత్యాధునిక నిఘా, సైబర్, కీలక ప్రదేశాల రక్షణలు ఇందులో ఉంటాయి. ప్రభుత్వ రక్షణ పరిశోధనా సంస్థలు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు.

ఇవి కూడా చదవండి..

అణు ఇంధన రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు.. ప్రధాని కీలక ప్రసంగం

ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 05:22 PM