ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Double-Decker Buses: ఇక రాజధాని నగరంలో డబుల్‌డెక్కర్‌ పరుగులు

ABN, Publish Date - Aug 15 , 2025 | 11:26 AM

నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సుల సంచారం ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం పలుచోట్ల డబుల్‌ డెక్కర్‌ బస్సులతో ట్రయల్‌ రన్‌ వేశారు. ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మహానగర రవాణా సంస్థ ఈ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపింది.

చెన్నై: నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సుల(Double-Decker Buses:) సంచారం ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం పలుచోట్ల డబుల్‌ డెక్కర్‌ బస్సులతో ట్రయల్‌ రన్‌ వేశారు. ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మహానగర రవాణా సంస్థ ఈ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపింది. నగరంలోని కోయంబేడు, సెంట్రల్‌ స్టేషన్‌, బ్రాడ్వే, మాధవరం, పూందమల్లి, తాంబరం, ఆవడి ప్రాంతాల మీదుగా డబుల్‌ డెక్కర్‌ బస్సుల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రారంభించిన ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులను తలపించేలా పై అంతస్థుతో, ఎరుపురంగులో ఉన్న ఈ బస్సుల సంచారాన్ని చూసి నగరవాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైతో పాటు కోల్‌కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు 1970 నుంచే నడిచాయి. ప్రస్తుతం మళ్ళీ కొత్త హంగులతో తయారైన 20 డబుల్‌ డెక్కర్‌ సిటీ బస్సులను నగరవాసులకు వింత అనుభూతిని కలిగించనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2025 | 03:37 PM