Delimitaion: పార్లమెంటును తాకనున్న డీలిమిటేషన్ సెగ .. డీఎంకే ఎంపీలు తీర్మానం
ABN, Publish Date - Mar 09 , 2025 | 04:44 PM
పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ అంశం చాలా కీలమైందని పేర్కొంటూ మూడు తీర్మానాలను డీఎంకే ఎంపీల సమావేశంలో ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్నిఆమోదించారు.
చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో దక్షిణాది రాష్ట్రాలకు ఉభయసభల్లో ప్రాతనిధ్యం తగ్గిపోతుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న డీఎంకే ఈ అంశంపై పార్లమెంటులోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మార్చి 10వ తేదీన తిరిగి పార్లమెంటు సమావేశమవుతున్నందున డీలిమిటేషన్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని డీఎంకీ ఎంపీలు ఆదివారంనాడు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలోని అన్నా అరివాలయంలో ఆదివారంనాడు పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. పార్టీ ఉభయసభల ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.
Ranya Rao: స్మగ్లింగ్ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి
పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ అంశం చాలా కీలమైందని పేర్కొంటూ మూడు తీర్మానాలను డీఎంకే ఎంపీల సమావేశంలో ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించారు.
తీర్మానాలివే..
తమిళనాడు లోక్‌సభ నియోజకవర్గాల పరిరక్షణకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఈ అంశాన్ని డీఎంకే ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తాలని మొదటి తీర్మానం పేర్కొంది. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను ఒక్కటి కూడా కోల్పోకుండా పోరాడి విజయం సాధించాలని ఆ తీర్మానం స్పష్టం చేసింది. డీలిమిటేషన్ అంశంపై పోరాటానికి కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలను డీఎంకే సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయిస్తూ రెండో తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో నియోజకవర్గాలు కోల్పోయేందుకు అవకాశమున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలతో డీఎంకే ఎంపీలు కలిసి పనిచేయాలని తీర్మానించింది. మార్చి 10వ తేదీ నుంచి తిరిగి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నందున డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ డీఎంకే ఎంపీలతో కలిసి బలంగా వాదనను ఉభయసభల్లో వినిపించాలని మూడో తీర్మానం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన
Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 09 , 2025 | 04:46 PM