Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
ABN , Publish Date - Mar 09 , 2025 | 10:29 AM
జమ్మూకశ్మీర్‌లో బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌కు ఉచితంగా భూకేటాయింపులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం తక్షణం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక లెజెండరీ స్పీన్నర్ ముత్తయ్య మురళీథరన్‌కు కశ్మీర్‌లో ఉచితంగా భూమి కేటాయించారన్న వార్త రాజకీయ కలకలానికి దారి తీసింది. కథువా జిల్లాలో తన బెవెరేజస్ కంపెనీకి సంబంధించి బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించారన్న వార్త సంచలనం రేపింది. ఈ వార్తపై ప్రతిపక్ష శాసనసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మీడియా కథనాల ప్రకారం, 25.75 ఎకరాల్లో మొత్తం రూ.1600 కోట్లతో మురళీధరన్‌కు చెందిన సీలోన్ బెవరేజస్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోందట. దీంతో పాటు, ఓ అల్యూమినియమ్ క్యాన్‌ల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారట (Muralitharan alloted Land in Kashmir).
General Upendra Dwivedi: పాక్, చైనాల కుమ్మక్కునూరు శాతం నిజం
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రతి పక్ష నేతలు భూకేటాయింపుల వార్తలను ప్రస్తావించారు. భూమిని ఉచితంగా కేటాయించడం ఏమిటని సీపీఐ(ఎమ్) ఎమ్మెల్యే ఎమ్‌వై తరిగామీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇది చాలా ఆందోళనకర అంశమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీఏ మిర్ అన్నారు. భారతీయులు కాని వారికి ఉచితంగా భూమి ఎలా దక్కిందనేదానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Lalit Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం
జమ్మూ కాశ్మీర్ జనాభా మార్పులు వస్తున్నాయని పీడీపీ నేత పర్రా పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త టౌన్‌షిప్‌ల లబ్ధిదారులు ఎవరనే విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండట్లేదని, క్లారిటీ లేదని అన్నారు. ‘‘ఈ కొత్త టౌన్‌షిప్‌లు స్థానికుల కోసం రూపొందించారా లేక బయటవాళ్ల కోసమా? ఇలాంటి ప్రాజెక్టులపై అస్పష్టతో జనాభాలో మార్పుల జరుగుతాయన్న ఆందోళన పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏదైనా ప్రయత్నం జరిగిందా.. ఇప్పటికే కాశ్మీర్‌లో వాతారణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది’’ అని అన్నారు.
వ్యవసాయోత్పత్తుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ దార్ ఈ విషయమై స్పందించారు. ‘‘ఇది రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అంశం. మా వద్ద ప్రస్తుతానికి ఏ సమాచారం లేదు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటాము’’ అని అన్నారు.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి