Share News

Lalit Modi: లలిత్‌ మోదీకి వనువాటు పౌరసత్వం

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:18 AM

ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌ మోదీ తన పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో అప్పగిస్తానని ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

 Lalit Modi: లలిత్‌ మోదీకి వనువాటు పౌరసత్వం

న్యూఢిల్లీ, మార్చి 8: ఐపీఎల్‌ మాజీ చైర్‌పర్సన్‌, పరారీలో ఉన్న లలిత్‌ మోదీ మరోసారి వార్తల్లో నిలిచారు. పసిఫిక్‌లోని ఒక చిన్న ద్వీప దేశమైన వనువాటు పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌ మోదీ తన పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో అప్పగిస్తానని ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. అంతకుముందే లలిత్‌ వనువాటు పౌరసత్వాన్ని పొందినట్లు తెలిసిందని, అయినా చట్టప్రకారం ఆయనపై కేసు దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 3లక్షల జనాభా కలిగిన వనువాటులో గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌ ప్రోగ్రామ్‌ అమలులో ఉంది. దీనిద్వారా రూ.1.3కోట్లు చెల్లించి ఆ దేశ పౌరసత్వాన్ని కొనుగోలు చేయవచ్చు. కాగా, గత రెండేళ్లలో దాదాపు 30మంది భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలతో సహా) వనువాటు పౌరసత్వం పొందారు.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 03:18 AM