Ranya Rao: స్మగ్లింగ్ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:46 PM
ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది.
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు (Gold Smuggling Case)లో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) విచారణలో కంటతడి పెట్టినట్టు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ రాకెట్‌తో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తనను ఇరికించారని చెప్పినట్టు సమాచారం. తాను అమాయకురాలినని ఆమె వాపోయిందని తెలుస్తోంది.
California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన
ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, ఆలోచిస్తూనే ఉన్నానని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది. ఆమె తాజా వాదన కెంపెగౌడ విమానాశ్రయంలో 17 బంగారు కడ్డీలతో పట్టుబడిన సమయంలో డీఅర్ఐకి ఇచ్చిన అధికారిక స్టేట్‌మెంట్‌కు భిన్నంగా ఉంది. తాను దుబాయ్ మాత్రమే కాకుండా, యూరప్, అమెరికా, మధ్యప్రాశ్చ దేశాల్లో పర్యటించినట్టు ఆమె డీఆర్ఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ట్రాప్‌లో ఇరికించిందెవరు?
స్మగ్లింగ్ రాకెట్‌తో తనకు సంబంధం లేదని, తనను ఇరికించారని రన్యారావు తాజా వాదనగా ఉండటంతో అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఆమె చెప్పినదే నిజమైతే ఆమెను స్మగ్లింగ్ కేసులో ఎవరు ఇరికించారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అని ప్రశ్నించి, వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.
ఇదే తరహాలో గత ఏడాది..
స్మగ్లింగ్ రాకెట్‌తో తనకు సంబంధం లేదని, తనను ఇందులో ఇరికించారని రన్యారావు చెబుతున్న తరహాలోనే గత ఏడాది కూడా చెన్నైలో ఒక ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి అక్రమంగా 12 కిలోల బంగారం తెస్తూ చెన్నైలో పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్‌తో ప్రమేయమున్న ఒక ఫ్రెండ్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఆ తర్వాత జరిగిన విచారణలో తేలింది. ఈ క్రమంలో రన్యారావుకు సన్నిహితంగా ఉన్నవారే ఆమెను ఈ ఉచ్చులోకి లాగి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రన్యారావు డీఆర్ఐ కస్టడీ గడువు మార్చి 10వ తేదీ వరకూ ఉంది.
ఇవి కూడా చదవండి
Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.