Maha Kumbh Mela Extension: మహా కుంభమేళా తేదీ పొడిగిస్తున్నారా.. అధికారుల క్లారిటీ..
ABN, Publish Date - Feb 18 , 2025 | 08:51 PM
గత కొన్ని రోజులుగా మహా కుంభమేళా 2025 తేదీని పొడిగింపు చేస్తున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. దీనిపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025) తేదీని మార్చి వరకు పొడిగిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధర్ (Ravindra kumar Mandar) క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈ పుకార్లను పూర్తిగా ఖండించి, ఇది కేవలం అవాస్తవం మాత్రమే అని తెలిపారు. మహాకుంభమేళా షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 26న ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం మహాకుంభమేళా తేదీని పొడిగించే ప్రతిపాదన లేదని ఆయన అన్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లపై శ్రద్ధ వహిస్తోందన్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పుకార్లను పట్టించుకోకుండా, తమ సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రద్దీ రోజుల్లో..
మహాకుంభమేళా సందర్భంగా భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ట్రాఫిక్ నిర్వహణ తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. రైల్వే స్టేషన్ మూసివేతపై కూడా ఆయన స్పందించారు. ముందస్తు నోటీసు లేకుండా ఏ రైల్వే స్టేషన్‌ను మూసివేయలేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో రద్దీ రోజుల్లో ప్రయాగ్ సంగం స్టేషన్‌ను మూసివేయడం జరిగిందని, కానీ ప్రస్తుతం అన్ని స్టేషన్లు పనిచేస్తున్నాయని రవీంద్ర కుమార్ అన్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.
పుకార్లను నమ్మోద్దని..
ఈ మహా కుంభమేళా ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ఒక చారిత్రాత్మక సందర్భమని రవీంద్ర కుమార్ మాంధర్ అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అన్ని కార్యకలాపాలను యథావిధిగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మహాకుంభమేళా తేదీని పొడిగించే పుకార్లపై అధికారికంగా క్లారిటీ ఇచ్చిన డీఎం, భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి అవాస్తవాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో విద్యార్థుల పరీక్షలపై కూడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడలేదన్నారు. షెడ్యూల్ ప్రకారం సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని విద్యార్థులు ఎగ్జామ్స్ రాసినట్లు తెలిపారు.
55 కోట్ల మంది
ఇప్పటివరకు మహా కుంభమేళాలో 55 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో చివరి రోజు ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) నాటికి ఈ సంఖ్య 60 కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 18 , 2025 | 09:14 PM