ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siddaramaiah: ఈవెంట్ మేము నిర్వహించలేదు, నన్ను ఆహ్వానించారు: సిద్ధరామయ్య

ABN, Publish Date - Jun 08 , 2025 | 09:27 PM

చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఫంక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కేఎస్‌సీఏనే నిర్వహించిందని ఆయన తెలిపారు.

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. తనను ఈవెంట్‌కు ఆహ్వానించడం వల్లే వెళ్లానని, గవర్నర్ కూడా ఈ ఈవెంట్‌కు వస్తున్నట్టు వారు తెలియజేశారని అన్నారు.

'కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి, కోశాధికారి నన్ను కలిసి ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ ఫంక్షన్‌ను మేము నిర్వహించలేదు, కేఎస్‌సీఏనే నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు గవర్నర్ కూడా వస్తున్నట్టు వారు తెలియజేశారు. అందుకే వెళ్లాను' అని సీఎం తెలిపారు.

కాగా, రాష్ట్ర పోలీసులు స్టేడియం వద్ద తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని విమర్శలు రావడంతో సిటీ పోలీస్ చీఫ్ సహా ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా సిట్‌ను ఆదేశించింది. దీనికి ముందు హైకోర్టు రిటైర్డ్ జడ్జి మైఖేల్ కన్హాతో దర్యాప్తునకు ఏకసభ్య కమిషన్‌ను కూడా నియమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మార్కెటింగ్ హెడ్‌, డీఎన్ఏ ఈవెంట్ మేనేజిమెంట్ కంపెనీ స్టాఫర్స్ సహా నలుగురిని గత శుక్రవారం నాడు అరెస్టు చేయగా.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి..

హిందీపై కమల్ హాసన్ హాట్ కామెంట్స్

లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్‌‌ వ్యాఖ్యలపై ఈసీ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 09:57 PM