ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagdeep Dhankar: బిన్ లాడెన్‌ను హతమార్చిన ఘటనతో ఆపరేషన్ సిందూర్‌కు పోలిక

ABN, Publish Date - May 17 , 2025 | 03:48 PM

పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిందని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదులకు పట్టున్న ప్రాంతాల్లోకి దూసుకెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు.

ఢిల్లీ: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)ను 9/11 దాడుల అనంతరం అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్‌తో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) పోల్చారు. రెండు సందర్భాల్లోనూ పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి ఆపరేషన్లు నిర్వహించారని, రెండూ విజయవంతమయ్యాయని అన్నారు.

All Party Delegations: ఏడు ప్రతినిధి బృందాలు.. టీమ్ లీడర్లు వీరే..


ఒసామా బిన్ లాడెన్‌ పేరును జగదీప్ ధన్‌ఖడ్ నేరుగా ప్రస్తావించకుండానే, సెప్టెంబర్ 11 (2001) దాడులకు బాధ్యుడైన గ్లోబల్ టెర్రరిస్టును అమెరికా దళాలు 2011 మే 2న ఇదే తరహా దాడిలో మట్టుబెట్టాయని చెప్పారు. "ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులపై దాడి ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా భారత్ ఒక బెంచ్ మార్క్‌ను సాధించింది'' అని ధన్‌ఖడ్ అన్నారు.


పాక్‌లోని తొమ్మది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిందని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదులకు పట్టున్న ప్రాంతాల్లోకి దూసుకెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారని అన్నారు. ఉగ్రవాదులకు మాత్రమే నష్టం వాటిల్లేలా ఎంతో కచ్చితత్వంతో భారత్ ఈ దాడులు జరిపిందని చెప్పారు. 2008 ముంబై దాడుల అనంతరం పౌరులపై అత్యంత పాశవిక దాడి పహల్గాంలో జరిగిందని, 26 మంది టూరిస్టులను కాల్చి చంపారని ఆయన అన్నారు. ఆ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బిహార్‌ నుంచి ప్రపంచానికి సందేశం పంపారని, అవి ఉత్తుత్తి మాటలు కావని ఇప్పుడు ప్రపంచం గ్రహించిందని ధన్‌ఖడ్ వివరించారు.


జాతీయ భద్రత విషయంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉందని, ముఖ్యంగా ట్రేడ్, బిజినెస్, కామర్స్ వంటి రంగాల్లో అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. భారత్ ప్రయోజనాలకు భంగం కలిగించే దేశాలకు మద్దతు ఇవ్వకూడదన్నారు. ఎకనామిక్ నేషనలిజం గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలోచించాల్సిన తరుణం వచ్చిందన్నారు. నేషన్ ఫస్ట్ అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలని ఢిల్లీలోని జైపూరియా ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ధన్‌ఖడ్ సూచించారు.


ఇవీ చదవండి:

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 04:38 PM