ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagdeep Dhankhar : ఇంతకీ ఆ మూడున్నర గంటల మధ్య ఏం జరిగింది

ABN, Publish Date - Jul 22 , 2025 | 08:30 PM

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 1.00 గంటకు జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కానీ సాయంత్రం మళ్లీ ఈ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశానికి ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు డుమ్మా కొట్టారు. ఈ అంశంపై చర్చ జరుగుతుంది.

న్యూఢిల్లీ, జులై 22: పార్లమెంట్ వర్ష కాల సమావేశాలు ప్రారంభ కాగానే.. అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోందని అంతా భావించారు. కానీ ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. దీంతో ఆయన రాజీనామా చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనారోగ్య సమస్యల కారణంగానే తాను ఈ పదవికి రాజీనామా చేసినట్లు జగదీప్ స్పష్టం చేశారు. కానీ ఉప రాష్ట్రపతి పదవికి ఆయన గుడ్ బై చెబుతారని ఎవరూ కలలో కూడా ఊహించ లేదు. దీంతో జగదీప్ రాజీనామాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల్లోపలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఎదుట ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ప్రయోజనాల కోసం ఐక్యత అవసరమని స్పష్టం చేశారు. అలాగే ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన, బిహార్‌లో ఎన్నికల వేళ.. ఓటర్ల నమోదు ప్రక్రియతోపాటు వివిధ అంశాలను చర్చించాలని నిర్ణయించారు. కానీ ఈ అంశాలపై తీవ్ర చర్చ జరుగుతుందన్న వేళ.. ఇలా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ రాజీనామా చేయడం తీవ్ర ఆసక్తి నెలకొంది. అదీకాక.. ఈ సమావేశాలు ప్రారంభం అనంతరం చర్చలు, వాయిదాల పరంపర కొనసాగింది.

అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిన నోట్ల కట్టలు బహిర్గతం కావడం.. ఆ తర్వాత ఆ అంశంపై భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కేరళ పర్యటనలో భాగంగా విద్యార్థులతో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందంటూ పెదవి విరిచారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నాడు చేసిన ఈ వ్యాఖ్యలే.. నేడు ఆయన పదవికి గండం తెచ్చిపెట్టాయనే ఒక ప్రచారం అయితే సాగుతోంది.

అదీకాక.. తొలి రోజు సమావేశాల్లో జగదీప్ చాలా హుషారుగా పాల్గొన్నారని పలువురు ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన సమీక్షలు సైతం నిర్వహించారని చెబుతున్నారు. అలాంటిది అంత ఆకస్మాతుగా తన పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నను ప్రతిపక్షాలు లేవనెత్తుతోన్నాయి. జగదీప్ ధన్ ఖడ్ అనారోగ్యం కారణంగానే రాజీనామా చేశారని పైకి చెబుతున్నప్పటికి కంటికి కనిపించని విషయం ఏదో దీని వెనుక దాగి ఉందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ వ్యక్తం చేశారు.

ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారన్నారు. కానీ సాయంత్రం 4.30 గంటలకు బిజినెస్ అడ్వయిజరీ సమావేశం మళ్లీ జరిగింది. ఈ సమావేశానికి ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు కాలేదని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా వెల్లడించారు. ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుందని సదరు ఎంపీ వివేక్ తంకా సందేహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 08:51 PM