ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGCA-Air India: విరిగిన సీట్లో మంత్రి ప్రయాణంపై ఏఐని వివరణ కోరిన డీజీసీఏ

ABN, Publish Date - Feb 22 , 2025 | 05:56 PM

ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అనుభవంపై సోషల్ మీడియాలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమేనని అన్నారు.

న్యూఢిల్లీ: భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారంటూ ఎయిర్ ఇండియా (Air India)నిర్వాకంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఆగ్రహం వ్యక్తం చేయడంపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ (DGCA) తక్షణ చర్యలకు దిగింది. వెంటనే వివరణ ఇవ్వాలని ఎయిరిండియాను ఆదేశించింది.

Air India: ఎయిర్‌ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్.. ప్రజలను మోసగిస్తున్నారంటూ గుస్సా


దీనికిముందు, ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అనుభవంపై సోషల్ మీడియాలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమేనని అన్నారు. ఎయిరిండియా నిర్వహణ టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత సేవలు మెరుగుపడాతాయని అనుకున్నానని, కానీ ఇది తన అపోహేనని అర్ధమైందని అసహనం వ్యక్తం చేశారు. విమానం ఎక్కగానే తన సీటు విరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. మరి కొన్ని సీట్లు కూడా సరిగా లేవని సిబ్బంది చెప్పారని, కొందరు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేశారని చెప్పారు. అయితే వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక విరిగిపోయిన సీటులోనే గంటన్నర ప్రయాణం చేశామని వివరించారు. కేంద్ర మంత్రి ట్వీట్‌‌పై ఎయిర్‌లైన్స్ వెంటనే స్పందించింది. మంత్రికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.


రామ్మోహన్ నాయుడు స్పందన

ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నాయుడు స్పందించారు. ఈ విషయమై ఎయిరిండియతో మాట్లాడామని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. మావైపు నుంచి డీజీసీఏ సైతం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. మంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగై మాట్లాడినట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 22 , 2025 | 06:21 PM