Share News

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

ABN , Publish Date - Feb 22 , 2025 | 03:25 PM

మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాకు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అనేక రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
Maha Kumbh Mela 2025 Trains Cancelled

మహా శివరాత్రి సందర్భంగా మీరు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం (Maha Kumbh Mela 2025) వెళ్లేందుకు ట్రైన్ జర్నీ కోసం చూస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే పలు కీలక ట్రైన్స్ రద్దయ్యాయి (Train Cancellations). ఈ సమాచారం ట్రైన్ జర్నీ చేసేవారికి చాలా కీలకం. ఈ క్రమంలో ఏ ట్రైన్స్ రద్దయ్యాయి, ఎప్పుడెప్పుడు రద్దయ్యాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా అమృత్ స్నాన్ రోజుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 174 రైళ్లను రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. వీటిలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 మధ్య 32 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో షెడ్యూల్ చేయబడిన రైళ్లలో ధన్‌బాద్, గోమోహ్, బొకారో మీదుగా నడిచే కుంభ్ ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి.


టికెట్ బుకింగ్‌లు నిలిపివేత

ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్, కల్కా-హౌరా నేతాజీ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక ప్రధాన రైళ్ల టికెట్ బుకింగ్‌లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇతర రైళ్లకు బుకింగ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి కూడా మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. కాబట్టి బుక్ చేసుకునే క్రమంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని, టిక్కెట్లను రిజర్వ్ చేసుకోండి.


మహా కుంభమేళా సందర్భంగా ఈ రెగ్యులర్ రైళ్లు రద్దు

  • 12802 న్యూఢిల్లీ - పూరి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 12308 జోధ్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 22308 బికనీర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 12312 కల్కా-హౌరా నేతాజీ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 18310 జమ్మూ తావి-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 18102 జమ్మూ తావి-టాటా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 24-27

  • 12444 ఆనంద్ విహార్-హల్దియా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25

  • 12320 ఆగ్రా కాంట్ - కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27


  • 12874 ఆనంద్ విహార్ - హతియా స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-26

  • 12816 ఆనంద్ విహార్ - పూరి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26-27

  • 22911 ఇండోర్ - హౌరా షిప్రా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25, 27

  • 12176 గ్వాలియర్-హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-28

  • 20976 ఆగ్రా కాంట్ - హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-28

  • 12178 మధుర-హౌరా చంబల్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25-28

  • 12820 ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25, 28


  • 12324 బార్మర్-హౌరా ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

  • 12826 ఆనంద్ విహార్ - రాంచీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

  • 12282 న్యూఢిల్లీ - భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27

  • 12495 బికనీర్ - కోల్‌కతా ప్రతాప్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27

  • 22858 ఆనంద్ విహార్ - సాంట్రాగచి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25

  • 12941 భావ్‌నగర్ - అసన్సోల్ పరస్నాథ్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25

  • 18609 రాంచీ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26


రద్దు చేయబడిన కుంభమేళా ప్రత్యేక రైళ్లు

  • 03680 కోయంబత్తూర్-ధన్‌బాద్ స్పెషల్ - ఫిబ్రవరి 25న రద్దు

  • 03064 తుండ్ల-హౌరా స్పెషల్ - ఫిబ్రవరి 24న రద్దు

  • 03021 హౌరా-తుండ్ల స్పెషల్ - ఫిబ్రవరి 26న రద్దు

  • 03025 హౌరా-తుండ్ల స్పెషల్ - ఫిబ్రవరి 28న రద్దు

  • 08425 భువనేశ్వర్-తుండ్ల స్పెషల్ - ఫిబ్రవరి 26న రద్దు

  • 08426 తుండ్ల-భువనేశ్వర్ స్పెషల్ - ఫిబ్రవరి 28న రద్దు


అసన్ సోల్ గుండా వెళ్ళే రైళ్లు కూడా రద్దు

  • 01904 కోల్‌కతా-ఆగ్రా కాంట్ స్పెషల్ - ఫిబ్రవరి 26

  • 12274 న్యూఢిల్లీ - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25

  • 12236 ఆనంద్ విహార్ - మధుపూర్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

  • 12362 ముంబై - అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

ధన్‌బాద్ డివిజన్‌లో రద్దు చేయబడ్డ రైళ్లు

  • 15076 తనక్‌పూర్-శక్తినగర్ ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 25

  • 15074 తనక్‌పూర్-సింగ్రౌలి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

  • 15075 శక్తినగర్ - తనక్‌పూర్ త్రివేణి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 26

  • 15073 సింగ్రౌలి-తనక్‌పూర్ త్రివేణి ఎక్స్‌ప్రెస్ - ఫిబ్రవరి 27


ఇవి కూడా చదవండి:

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 22 , 2025 | 03:27 PM