ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Devendra Fadnavis: ఆ క్రెడిట్ నాకు ఇచ్చినందుకు థాంక్స్... ఠాక్రే సోదరుల కలయికపై సీఎం

ABN, Publish Date - Jul 05 , 2025 | 06:47 PM

తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.

ముంబై: దాదాపు 20 ఏళ్ల తర్వాత విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), రాజ్ ఠాక్రే (Raj Thackeray) శనివారంనాడు ఒకే వేదకను పంచుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. కుటుంబ సమేతంగా ఈ ఇరువురు నేతలు పాల్గొన్నారు. తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. కాగా, రాజ్ వ్యాఖ్యలపై దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు. ఠాక్రే కజిన్లను కలిపానంటూ తనకు క్రెడిట్ ఇవ్వడంపై ఫడ్నవిస్ థాంక్స్ చెప్పారు.

'మరాఠీ భాషపై నిర్వహించిన విక్టరీ ర్యాలీ అది. కానీ, ఉద్ధవ్ ఠాక్రే రాజకీయాలు మాట్లాడేందుకు, ఎలా గద్దె దిగాల్సి వచ్చిందో చెప్పడానికే వేదికను ఎంచుకున్నారు. 25 ఏళ్లకు పైగా బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌‌ను పాలిస్తున్నా వాళ్లు చేసిందేమీ లేదు. ఆ నిరాశానిస్పృహలతోనే ఆయన మాట్లాడుతున్నారు. మేము సిటీని అభివృద్ధి చేశాం. ముంబైలోని మరాఠీ ప్రజల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నాం . మరాఠీలుగా మేము గర్విస్తున్నాం. సమ్మిళిత హిందుత్వను మేము నమ్ముతున్నాం' అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.

మేము గుండాలమే...

ముంబై ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అవును, మేము గూండాలమే. గూండాలుగా ఉంటేనే న్యాయం జరుగుతుందంటే మేము గూండాగిరి చేస్తాం. మరాఠీ పరిరక్షణ మాకు గర్వకారణం' అని అన్నారు. కలిసి ఉండడానికే తాము కలిసామని రాజ్‌తో తమ కలయికను అభివర్ణించారు. రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వానికి లెజిస్లేటివ్ పవర్ ఉంటే, థాకరే కుటుంబానికి వీధుల్లో పవర్ ఉందని అన్నారు. రాష్ట్ర పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యా నిపుణులతో కలిసి తీసుకున్నది కాదని, కేవలం అధికారంలో ఉన్నామనే కారణంగా బలవంతగా తీసుకువచ్చినదని విమర్శించారు. హిందీపై తీసుకున్న నిర్ణయం సైలెంట్‌గా ఆమోదించినట్లయితే, ఆ తర్వాత అడుగుగా మహారాష్ట్ర నుంచి ముంబైని విడిగొట్టే ప్రయత్నం జరిగి ఉండేదన్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

మోదీ ఎమోషనల్ స్పీచ్.. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 06:51 PM