ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: చిక్కుల్లో మంత్రి ఈవీ వేలు.. రూ.20లక్షల కరెన్సీ మాలతో..

ABN, Publish Date - Jun 12 , 2025 | 01:23 PM

తమిళగ వెట్రి కళగం (టీవీకే) తిరువణ్ణామలై దక్షిణ జిల్లా శాఖ కార్యదర్శి భారతిదాసన్‌ తను కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుకలకు విచ్చేసిన మంత్రి ఈవీ వేలుకు రూ.20ల కరెన్సీ మాల వేసి స్వాగతం పలకటం వివాదాస్పదంగా మారింది.

- మంత్రికి కరెన్సీ మాలతో స్వాగతం..

- విజయ్‌కి సారీ చెప్పిన టీవీకే నేత

చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) తిరువణ్ణామలై దక్షిణ జిల్లా శాఖ కార్యదర్శి భారతిదాసన్‌(Bharathidasan) తను కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుకలకు విచ్చేసిన మంత్రి ఈవీ వేలుకు రూ.20లక్షల కరెన్సీ మాల వేసి స్వాగతం పలకటం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 8న జరిగిన గృహ ప్రవేశానికి మంత్రి ఈవీ వేలును ఆహ్వానించారు. మంత్రి ఈ కార్యక్రమానికి రావడంతో భారతిదాసన్‌ సంతోషంగా ఆయనకు కరెన్సీ నోట్ల మాల వేసి స్వాగతం పలికారు. ఆ వేడుకల్లో మంత్రి పాల్గొని భారతిదాసన్‌కు కానుకను కూడా అందజేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి వేలును కరెన్సీ నోట్ల మాలవేసి భారతిదాసన్‌ స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. డీఎంకేను రాజకీయ బద్ధశత్రువుగా భావిస్తున్న టీవీకేకు చెందిన నాయకుడు మంత్రి వేలును కరెన్సీమాలతో స్వాగతం పలకడం న్యాయమేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో టీవీకే అధిష్టానం ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది. దానికి భారతిదాసన్‌ బదులిస్తూ తమ కుటుంబ స్నేహితుడైన మంత్రి ఈవీ వేలును గృహప్రవేశానికి ఆహ్వానించానని, ఆ సందర్భంగా రాష్ట్ర మంత్రి కనుక ఆయనను గౌరవించాలనే భావంతోనే కరెన్సీ నోట్ల మాల వేసి స్వాగతించానని చెప్పారు.

ఆ సంఘటన పట్ల పార్టీ అధిష్టానవర్గానికి ఆయన భేషరతుగా క్షమాపణ తెలిపారు. ఇకపై టీవీకే వ్యతిరేకించే పార్టీ ప్రముఖులందరికీ దూరంగా ఉంటానని, తన ఇంట జరిగే వేడుకలకు డీఎంకేకు చెందినవారిని ఎట్టి పరిస్థితులలోనూ ఆహ్వానించనని స్పష్టం చేస్తూ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కి మరోమారు తాను క్షమాపణలు తెలుపుకుంటున్నానని భారతిదాసన్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మంత్రి ఈవీ వేలు ఈ సంఘటనపై వివరణ ఇస్తూ భారతిదాసన్‌ కుటుంబ సభ్యుల్లో చాలామంది డీఎంకేకు చెందినవారని, కనుక ఆ కుటుంబంతో తనకు చాలా కాలంగా సంబంధాలున్నాయని, ఆ కారణంగా గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళానని తెలిపారు. అంతేకాకుండా తిరువణ్ణామలై నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందినవారైనా వారింట జరిగే శుభకార్యాలకు ఆహ్వానిస్తే, వీలునుబట్టి తప్పకుండా వెళతానని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి.

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 01:23 PM