ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

COVID-19: హాంకాంగ్‌, సింగపూర్‌లో కొవిడ్‌ అలజడి..!

ABN, Publish Date - May 16 , 2025 | 05:14 AM

ఐదేళ్ల క్రితం యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్‌, సింగపూర్‌లలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.

  • ఆసియా అంతటా పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ, మే 15: ఐదేళ్ల క్రితం యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్‌, సింగపూర్‌లలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ వారం లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.


ఈ నెల 3 నుంచి ఇక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల తీవ్రత పెరిగిందని, అలాగే కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సింగపూర్‌లో కూడా కొవిడ్‌ అలజడి కనిపిస్తోంది. ఈ నెల 3వ తేదీ తర్వాత ఏడు రోజుల్లోనే కేసుల సంఖ్య దాదాపు 28 శాతం పెరిగిందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated Date - May 16 , 2025 | 05:14 AM