ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pune: యువతిని రేప్‌ చేసి.. ఆమె ఫోన్‌తో సెల్ఫీ దిగి

ABN, Publish Date - Jul 04 , 2025 | 03:24 AM

డెలివరీ బాయ్‌నని చెప్పుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతి 22 పై అత్యాచారానికి పాల్పడ్డాడు.,,

  • కొరియర్‌ బాయ్‌నని చెప్పుకొని ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు..

  • పుణెలోని రెసిడెన్షియల్‌ సొసైటీలో ఘోరం

పుణె, జూలై 3: డెలివరీ బాయ్‌నని చెప్పుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతి (22)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫోన్‌తోనే అతడు సెల్ఫీ దిగి.. ‘నేను మళ్లీ వస్తా’అంటూ బెదిరింపు సందేశాన్నుంచడం గమనార్హం! పుణెలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల కోండ్వాలోని రెసిడెన్షియల్‌ సొసైటీలో ఈ ఘటన జరిగింది. కొరియర్‌ డెలివరీ బాయ్‌గా చెప్పుకొని దుండగుడు యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లాడు. బ్యాంకు నుంచి లెటర్‌ వచ్చిందని సంతకం చేసి తీసుకోవాలంటూ యువతితో దుండగుడు చెప్పాడు. పెన్నుందా? అని అడిగిన యువతి, అతడు తన వద్ద లేదని చెప్పడంతో తెచ్చేందుకు ఆమె పడకగదిలోకి వెళ్లింది.

వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు పడకగదిలోకి వెళ్లి ఆమె ముఖంపై మత్తు మందు స్ర్పే కొట్టాడు. స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి మెలకువ వచ్చేసరికి ఫోన్లో.. ‘నేను మళ్లీ వస్తాను’అనే మెసేజ్‌ ఉంది. దుండగుడు ఆమె ఫోన్‌తోనే సెల్ఫీ దిగాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 04 , 2025 | 03:24 AM