Karnataka: నో అన్నదే ఆన్సర్.. సీఎం మార్పుపై సూర్జేవాలా
ABN, Publish Date - Jul 01 , 2025 | 03:39 PM
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. సుమారు 100 ఎమ్మెల్యేలు డీకేకు మద్దతిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మంగళవారంనాడు పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా (Randeep Surjewala) తెరదించారు. అలాంటి కసరత్తు ఏమీ జరగడం లేదని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. సుమారు 100 ఎమ్మెల్యేలు డీకేకు మద్దతిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మంగళవారంనాడు పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, నాయకత్వ మార్పు లేదన్నదే తన జవాబు అని చెప్పారు. సమర్ధవంతమైన పాలనను మాత్రమే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని తెలిపారు. సీఎం పదవికి డీకే అర్హులేనని, పార్టీని పటిష్టం చేయడంతో పాటు అనేక ఆందోళనలకు సమర్ధవంతంగా ఆయన నాయకత్వం వహించారని ప్రశంసించారు. ఎమ్మెల్యేలకు నిజంగానే ఏదైనా సమస్య ఉంటే పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు.
బీజేపీపై సూర్జేవాలా విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను దెబ్బతీసేందుకే బీజేపీ తప్పుడు ప్రచారం సాగిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆపేస్తారంటూ ఆర్ అశోక్ నుంచి విజయేంద్ర వరకూ చెబుతున్నారని, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందకూడదనే బీజేపీ కోరుకుంటోందని విమర్శించారు. తమది సంక్షేమ ఆధారిత పాలన అని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసారా లేదా అనేది చూడకుండా ప్రతి ఒక్కరి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అభివృద్ధికి అవసరమైన తగినన్ని నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధ్రువీకరించారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆ దిశగా ముందుకు వెళ్తుందని సూర్జేవాలా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం
For National News And Telugu News
Updated Date - Jul 01 , 2025 | 05:23 PM