ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trumps ceasefire announcement: కాల్పుల విరమణను ట్రంప్‌ ప్రకటించడమేంటి

ABN, Publish Date - May 12 , 2025 | 04:53 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్‌ ముందస్తుగా ప్రకటించిన విషయంలో కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, ట్రంప్‌ ప్రకటనపై పార్లమెంట్‌లో చర్చ కోరుతూ రాహుల్‌గాంధీ ప్రత్యేక సమావేశం ఆహ్వానించారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించండి

ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ అవసరం

ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ, ఖర్గే లేఖలు

న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, కాల్పుల విరమణ ఒప్పందం, ట్రంప్‌ ప్రకటన తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఖర్గే లేఖలు రాశారు. ‘‘పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలనే ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనను నేను పునరుద్ఘాటిస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌తోపాటు కాల్పుల విరమణను తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉంది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు మన సమష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం’’ అని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తెలిపారు. కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌ దేశాలకు సంబంధించినది మాత్రమేనని చెప్పే బీజేపీ ప్రభుత్వం.. మూడో దేశమైన అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ షరతులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. మరోవైపు పాకిస్థాన్‌తో చోటుచేసుకున్న పరిణామాలను వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ కోరారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 04:53 AM