ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం పెట్టండి: కాంగ్రెస్
ABN, Publish Date - May 11 , 2025 | 04:34 AM
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయనే ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
న్యూఢిల్లీ, మే 10 : భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయనే ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించి జరిగిన పరిణామాలను అన్ని పార్టీల నేతకు వివరించాలని కోరింది. అలాగే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
మరోపక్క, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైన్యంతో కలిసి ఉన్న ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేసిన కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా.. ఇందిర లేని లోటు దేశంలో కనిపిస్తుంది అనే అర్థం వచ్చేలా ‘‘ఇండియా మిసెస్ ఇందిరా’’ అనే శీర్షిక పెట్టారు.
Updated Date - May 11 , 2025 | 04:34 AM