Nishikant Dubey: చట్టాలు వాళ్లే చేస్తే పార్లమెంటు మూసేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 08:03 PM
అత్యున్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి
న్యూఢిల్లీ: రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖాడ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుటికే వివాదం రేపగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబై (Nishikant Dubey) సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు
దేశంలో మతపరమైన యుద్ధాలను ప్రోత్సహిస్తు్న్నందుకు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని దూబే ఆరోపించారు. ''అత్యున్నత న్యాయస్థానమే చట్టాలు చేస్తే పార్లమెంటు భవనాన్ని మూసివేయాలి. నీ ముఖం చూపించు, నీకు చట్టం చూపిస్తాను..అన్నదే సుప్రీంకోర్టు ఏకైక లక్ష్యం. సుప్రీం కోర్టు అన్ని పరిమితులు దాటి వ్యవహరిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయానికి సుప్రీంకోర్టుకు వెళ్తే ఇక పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు మూసేసుకోవాలి'' అని దుబే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ''దేశంలో చోటుచేసుకున్న అన్ని అంతర్యుద్ధాలకు సీజేఐ సంజీవ్ ఖన్నా బాధ్యులు" అని వ్యాఖ్యానించారు.
చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకే ఉంది..
''హోమోసెక్సువాలిటీ పెద్ద నేరమని 377 అధికరణలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఆడ, మగ మత్రమే ఉన్నట్టు చెప్పింది. హిందువులు, ముస్లిం, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఎవరైనా సరే హోమోసెక్యువాలిటీని నేరమనే నమ్ముతాయి. అకస్మాత్తుగా ఒకరోజు సుప్రీంకోర్టు ఈ కేసును రద్దు చేసింది. పార్లమెంటుకు మాత్రమే చట్టాలను చేసే హక్కు ఉందని, సుప్రీంకోర్టు చట్టం అర్ధాన్ని మాత్రమే వివరించాలని 368వ అధికరణ చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానం బిల్లుల సంగతేమిటని రాష్ట్రపతిని, గవర్నర్‌ని ప్రశ్నిస్తోంది. రామమందిరం, కృష్ణ జన్మభూమి, జ్ఞానవాపి కేసులు వచ్చినప్పుడు పేపర్లు చూపించమని మీరు (సుప్రీంకోర్టు) అడుగుతారు. మొఘలులు వచ్చాకే ఆ కట్టడాలన్నీ మసీదులయ్యాయి. పేపర్లు ఎక్కడి నుంచి తేవాలి?'' అని దూబే ప్రశ్నించారు.
''అపాయింటింగ్ అథారిటీకి మీరు ఆదేశాలు ఎలా ఇస్తారు? సీజేఐని రాష్ట్రపతి నియమిస్తారు. పార్లమెంటు ఈ దేశ చట్టాలను చేస్తుంది. మీరు పార్లమెంటును డిక్టేట్ చేస్తారు? మీరు కొత్త చట్టం ఎలా చేస్తారు? మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఏ చట్టంలో రాసుంది? దాని అర్థం..ఈ దేశాన్ని అరాచకవాదం వైపు నెట్టాలనుకుంటున్నారు. పార్లమెంటు సమావేశమైనప్పుడు దీనిపై సమగ్ర చర్చ జరగాలి'' అని దూబే అన్నారు.
దూబేపై కాంగ్రెస్ విమర్శల దాడి
సుప్రీంకోర్టుపై నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. అన్ని వ్యవస్థలనూ దూబే ధ్వంసం చేస్తూ పోతున్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టు పరువుకు భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని, ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇంతవరకూ అన్ని వ్యవస్థలపైన దాడి చేసిన దూబే ఇప్పుడు సుప్రీంకోర్టుపై పడ్డారని, పార్లమెంటులో కాకుండా పార్లమెంటు వెలుపల ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణిస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: సౌదీ అరేబియాలో మోదీ రెండ్రోజుల పర్యటన
Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..
Updated Date - Apr 19 , 2025 | 09:06 PM