ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India-China Relations: సహకారంతోనే ఎదుగుతాం

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:36 AM

పరస్పర సహకారంతోనే ఉభయపక్షాలు ఎదుగుతాయని అభిప్రాయపడింది. ‘డ్రాగన్‌, ఐరావతం కలిసి పాడాల్సిన గీతమిదే.’ అంటూ వ్యాఖ్యానించింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన గత మూడేళ్ల కాలంలో భారత్‌, చైనా తొలిసారి బాహాటంగా పరస్పరం సానుకూలతను ప్రకటించాయి.

మోదీ వ్యాఖ్యలకు చైనా సానుకూలత

మాది రెండువేల ఏళ్ల బంధమని వ్యాఖ్య

బీజింగ్‌, మార్చి 17: ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. పరస్పర సహకారంతోనే ఉభయపక్షాలు ఎదుగుతాయని అభిప్రాయపడింది. ‘డ్రాగన్‌, ఐరావతం కలిసి పాడాల్సిన గీతమిదే.’ అంటూ వ్యాఖ్యానించింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన గత మూడేళ్ల కాలంలో భారత్‌, చైనా తొలిసారి బాహాటంగా పరస్పరం సానుకూలతను ప్రకటించాయి. ఇటీవల తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల తర్వాత సరిహద్దుల్లో సాధారణ స్థితి నెలకొందని అమెరికాకు చెందిన లిక్స్‌ ఫ్రీడ్‌మన్‌ పాస్ట్‌కార్డ్‌ ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పందించారు. ‘‘రెండు వేల సంవత్సరాలకు పైగా భారత్‌, చైనాలు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. మా నవ నాగరికతా విజయాలకు, వికాసానికి పరస్పరం తోడ్పడ్డాయి.’’ అని మావో నింగ్‌ అన్నారు.


సామాజిక మాధ్యమం‘ట్రూత్‌ సోషల్‌’లో చేరిన మోదీ

న్యూఢిల్లీ, మార్చి 17: సామాజిక మాధ్యమం వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఖాతా తెరిచారు. ఈ వేదికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆఽధ్వర్యంలోని ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. లెక్స్‌ ఫ్రీడ్‌మ్యాన్‌తో మోదీ పాల్గొన్న పాడ్‌కాస్ట్‌ను ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. దాంతో మోదీ కూడా ట్రూత్‌ సోషల్‌లో చేరారు. అర్థవంతమైన సంభాషణల కోసం ఎదురు చూస్తున్నానంటూ పోస్టు పెట్టారు. పాడ్‌కా్‌స్టను షేర్‌ చేసినందుకు ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:36 AM