Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:32 PM
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు PURE ఎనర్జీ (ప్యూర్)సంస్థ వెల్లడించింది. వాటిని మార్చి 25వ తేదీన హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వీటి ఆవిష్కరణలపై డాక్టర్ ప్యూర్ వ్యవస్థాపకుడు,ఎండీ నిశాంత్ డోంగరి మాట్లాడుతూ.. తాము అధునాతన బ్యాటరీ సాంకేతికత, ఏఐ ఆధారిత పవర్ ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన నియంత్రణతో అత్యంత సమర్థవంతమైన విద్యుత్ శక్తి వ్యవస్థను సమన్వయం చేసే వినూత్న శక్తి నిల్వ ఉత్పత్తులను PuREPower ద్వారా పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు.
హైదరాబాద్,మార్చి 17: దేశంలో ఇంధన నిల్వలతో పాటు విద్యుత్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న PURE ఎనర్జీ (ప్యూర్) సోమవారం అంటే.. మార్చి 17వ తేదీన కీలక ప్రకటన చేసింది. ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. వాటిని మార్చి 25వ తేదీన హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వీటి ఆవిష్కరణలపై డాక్టర్ ప్యూర్ వ్యవస్థాపకుడు, ఎండీ నిశాంత్ డోంగరి స్పందించారు. తాము అధునాతన బ్యాటరీ సాంకేతికత, ఏఐ ఆధారిత పవర్ ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన నియంత్రణతో అత్యంత సమర్థవంతమైన విద్యుత్ శక్తి వ్యవస్థను సమన్వయం చేసే వినూత్న శక్తి నిల్వ ఉత్పత్తులను PuREPower ద్వారా పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తామన్నారు.
ఈ సంస్థ సహా వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వదేరా మాట్లాడుతూ.. దేశంలో ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యాల పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌లోని HICC నోవాటెల్‌లో జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. కె. సారస్వత్, శ్రీ యూజీన్ హువాంగ్, క్రియేటివ్ సెన్సార్స్ ఇంక్ (CSI), టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ హాజరు కావటంతో పాటుగా విప్లవాత్మక PuREPower ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారికి PuREPower ఉత్పత్తి డెమోలు, వాటి వాణిజ్య ప్రకటనలు, పంపిణీలకు సంబంధించి.. ప్రత్యేక ప్రివ్యూను అందిస్తుంది. వాణిజ్యం నుంచి గ్రిడ్ స్కేల్ వరకు శక్తి నిల్వ యొక్క ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్మించగల వాటి సామర్థ్యంపై లోతైన అవగాహన అందిస్తుందని ప్యూర్ పవర్ (PuREPower) ఓ ప్రకటనలో వివరించింది.
ఇవి కూడా చదవండి..
Ola Electric shares: భారీగా పతనమవుతున్న ఓలా షేర్లు.. ఏడాది కనిష్టానికి చేరిక.. కారణం ఇదే..
Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 340 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..