ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: దలైలామాకు మోదీ శుభాకాంక్షలపై చైనా అభ్యంతరం

ABN, Publish Date - Jul 08 , 2025 | 05:51 AM

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంపై చైనా అభ్యంతరం తెలిపింది.

బీజింగ్‌, జూలై7: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంపై చైనా అభ్యంతరం తెలిపింది. దలైలామా 90వ జన్మదిన ఉత్సవాలకు భారత మంత్రులు, సీనియర్‌ అధికారులు, ప్రముఖులు హాజరుకావడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. టిబెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో చైనా మనోభావాలను అర్థం చేసుకోవాలని సూచించింది.

టిబెట్‌ వ్యవహారాల్లో చైనా వైఖరి స్థిరంగా ఉందని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత్‌ మానుకోవాలని సూచించారు. దీనిపై భారత్‌కు అభ్యంతరం తెలియజేశామని చెప్పారు.

Updated Date - Jul 08 , 2025 | 05:51 AM