Chhattisgarh: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు
ABN, Publish Date - Feb 02 , 2025 | 06:56 PM
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాలే లక్ష్యం అమర్చిన ఐఈడీని వారు ధ్వంసం చేశారు. కూబింగ్ నిర్వహిస్తున్న దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారు.
ఛత్తీస్‌గఢ్, ఫిబ్రవరి 02: ఛత్తీస్‌గఢ్‌లో మవోయిస్టులు, భద్రత దళాల మధ్య బీకర పోరు జరుగుతోంది. అలాంటి వేళ.. మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు ఆదివారం భగ్నం చేశాయి. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబ్‌ను భద్రతా దళాలు గుర్తించి.. వాటిని ధ్వంసం చేశాయి. ఊసూరు - ఆనపల్లి రహదారిలో 25 కేజీల ఐఈడీనీ బాండ్ డిటెక్ట్ స్క్వాడ్ గుర్తించింది. అనంతరం ఈ ఐఈడీని సీఆర్‌పీఎఫ్ 196 బెటాలియన్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అందులోభాగంగా ఊసూరు- ఆనపల్లి రహదారిపై ఈ ఐఈడీని గుర్తించాయి.
మరోవైపు బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన స్థలంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గంగలూరు పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమావేశమైనట్లు నిఘా వర్గాల ద్వారా భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులకు పోలీసులు తారస పడ్డారు. దాంతో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిస్పందనగా పోలీసులు సైతం కాల్పులు జరిపారు.
మరోవైపు గత నెల రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లో పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో దాదాపు 50 మంది మావోయిస్టులు మరణించారు. ఇంకా చెప్పాలంటే.. జనవరి 16వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ కొద్ది రోజులకే ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మృతి చెందారు. ఆయనపై రూ. కోటి రివార్డుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24 మంది మరణించారు.
Also Read: బాలీవుడ్ నటులపై కేసు
2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం పకడ్బందీ వ్యూహా రచనతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో గతేడాది అంటే..2024లో ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 219 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు తుడిచి పెట్టుకు పోయారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మాత్రం ఇంకా మావోయిస్టులు అలజడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సైతం మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం నడుం బిగించింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: వసంత పంచమి.. ఇలా చేయండి చాలు
Also Read: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
For National News And Telugu News
Updated Date - Feb 02 , 2025 | 06:58 PM