Share News

Bollywood Actors: బాలీవుడ్ నటులపై కేసు

ABN , Publish Date - Feb 02 , 2025 | 05:59 PM

Bollywood Actors: కోట్లాది రూపాయిలు మోసం చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ ప్రముఖ నటులు అలోక్ నాథ్, శ్రేయాస్ తల్పాడే‌తోపాటు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల వేదికగా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ను ప్రారంభించారు.

Bollywood Actors: బాలీవుడ్ నటులపై కేసు
Bollywood actors Alok Nath, Shreyas Talpade

లక్నో , ఫిబ్రవరి 02: కోట్లాది రూపాయిల మోసం చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ ప్రముఖ నటులు అలోక్ నాథ్, శ్రేయాస్ తల్పాడే‌తోపాటు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన ఐదుగురు సభ్యులపై ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయిలు వసూలు చేశారని.. అనంతరం ఈ సొసైటీకి చెందిన డైరెక్టర్లు అదృశ్యమయ్యారని బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ఐదేళ్లుగా తమ నుంచి భారీ ఎత్తున నగదు వసూలు చేశారని.. ఈ నేపథ్యంలో వాటిని వెంటనే తమకు వెనక్కి ఇవ్వాలని ఈ సందర్భంగా బాధితులు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ సొసైటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు అలోక్ నాథ్, శ్రేయాస్ తల్పాడేలు పలు కార్యక్రమాలు నిర్వహించారని బాధితులు ఆరోపించారు.

మరోవైపు ఈ సొసైటీ చేపట్టిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోను సూద్ సైతం ముఖ్య అతిథిగా హజరయ్యారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ. 9.12 కోట్లు మేర ఈ ఏడుగురు.. తమను మోసం చేశారని బాధితులు తమ ఫిర్యాదులో వివరించారు.

Also Read: వసంత పంచమి.. ఇలా చేయండి చాలు


2016, సెప్టెంబర్ 16వ తేదీన హర్యానా, లక్నో లతోపాటు పలు రాష్ట్రాల్లో హ్యూమన్ వెల్పేర్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసి.. వ్యాపారం ప్రారంభించారు. ఈ సొసైటీని మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కేంద్రంగా నిర్వాహకులు రిజిస్టర్డ్ చేశారు. తమ సొసైటీలో నగదు ఫిక్స్ డ్, రికరింగ్ డిపాజిట్ పథకాల రూపంలో నగదు జమ చేస్తే.. ఆకర్షణీయమైన వడ్డీలు అందజేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు.

Also Read: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

ఆ క్రమంలో పలు హోటళ్లుల్లో భారీ ఈవెంట్లు నిర్వహించారు. దీంతో ప్రజలు.. భారీగా నగదు డిపాజిట్ చేశారు. అలా సొసైటీ బ్రాంచ్‌లు రాష్ట్రవాప్తంగా 250కు చేరుకున్నాయి. అనంతరం సదరు సొసైటీ నిర్వాహకులు అదృశ్యమయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసులో ఈ ఇద్దరు బాలీవుడ్ నటులతోపాటు మరో 11 మందిపై హర్యానాలోని సోనిపట్‌లో ఇప్పటికే కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Updated Date - Feb 02 , 2025 | 06:09 PM