Chennai: తాను చనిపోతూ.. మరో ముగ్గురికి..
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:47 AM
తాను చనిపోతూ.. మరో ముగ్గురికి పునర్జన్మ అందించాడో యువకుడు. సురేందర్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం మెదడు నిర్జీవమైంది. అయితే.. అతని అవయవాలను దానం చేశారు. దీంతో మరో ముగ్గురు పునర్జన్మ పొందినట్లైంది.
- మెదడు నిర్జీవమైన యువకుడి అవయవాల దానం
చెన్నై: మెదడు నిర్జీవమైన యువకుడు అవయవ దానంతో పలువురు పునర్జన్మ పొందారు. అరపాక్కం శివరాజపురానికి చెందిన రాజ్‌కుమార్(Rajkumar) చిన్న కుమారుడు సురేందర్ (23) గత నెల 31వ తేది వేలూరు సమీపంలో ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 1వ తేది రాజ్‌కుమార్ మెదడు నిర్జీవమైనట్లు నిర్ధారించిన వైద్యులు, అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో రాజ్‌కుమార్ గుండె, ఊపిరితిత్తులు చెన్నై అపోలో ఆసుపత్రికి, పేగులు, ఒక కిడ్నీ వేలూరు, రాణిపేట సీఎంసీ ఆస్పత్రికి, మరో కిడ్నీ చెన్నై కాళియప్ప ఆస్పత్రి, నేత్రాలు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి అందజేసినట్లు సీఎంసీ పీఆర్వో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 03 , 2025 | 11:47 AM