Center : బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదన్న కేంద్రం
ABN, Publish Date - Aug 16 , 2025 | 01:24 PM
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 16 : బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించటం అనే అంశంపై కేంద్రం స్పందించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించేలా కోర్టులు వారిని నిర్దేశించవచ్చా? అన్నదానిపై సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం బదులిచ్చింది.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం.. సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
బిల్లుల అంగీకారం అంశంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై గడువు విధింపుతో రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని కూడా కేంద్రం అభిప్రాయపడింది.
ఆ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు ఉన్నత ఆదర్శాలు అని చెప్పిన కేంద్రం.. వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే న్యాయ జోక్యాల కంటే.. రాజ్యాంగపరమైన యంత్రాంగం ద్వారా సరిదిద్దాలని సుప్రీంకు కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు
Updated Date - Aug 16 , 2025 | 01:24 PM