ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Driving License Rules: బీమా లేని వాహనాలపై కొరడా

ABN, Publish Date - Aug 04 , 2025 | 03:57 AM

రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులతోపాటు ఇన్సూరెన్స్‌ లేని వాహనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర

  • భారీ జరిమానా విధించాలని కేంద్రం ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆగస్టు 3: రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులతోపాటు ఇన్సూరెన్స్‌ లేని వాహనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మోటారు వాహనాల చట్టంలో కొత్త సవరణలను ప్రతిపాదించింది. బీమా లేని వాహనాలను రోడ్డుమీద తిప్పితే.. భారీగా జరిమానా విధించాలని ఈ ప్రతిపా దనల్లో పేర్కొంది. ప్రస్తుతం బీమా లేకుండా వాహనాలు నడిపితే.. తొలిసారి ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.2వేలు, మళ్లీ మళ్లీ ఇదే నేరానికి ప్పాలడితే రూ.4వేలు జరిమానా విధిస్తున్నారు. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం మొదటిసారి ఇన్సూరెన్స్‌ లేకుండా పట్టుబడితే ప్రాథమిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు, తదుపరి ఉల్లంఘనలకు ఐదు రెట్లు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇది అమలులోకి వస్తే బీమా లేని కార్లకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. భారత్‌లో బీమా లేని కార్లు, వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు ఉపక్రమించనుంది. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరు ద్ధరణలో కూడా కొన్ని కఠిన నిబంధనలు విధించాలని ప్రతిపాదించింది. అతివేగం లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి తప్పనిసరిగా డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ సమయంలో 55 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని పేర్కొంది. అలాగే.. ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన వేగ పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న వేగ పరిమితులకు మధ్య తేడా ఉంటోంది. దీనివల్ల డ్రైవర్లు గందరగోళానికి గురవుతూ.. తమకు తెలియకుండానే వేగ పరిమితులను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేగ పరిమితుల్లో సవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 03:57 AM