ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాద్‌కు బీఎండీ కవచం!

ABN, Publish Date - Jun 21 , 2025 | 05:36 AM

దేశ రక్షణలో కీలకమైన ‘ఖండాంతర క్షిపణి రక్షణ’ (బీఎండీ) వ్యవస్థను హైదరాబాద్‌కు కూడా విస్తరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

  • ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ.. ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు

  • భాగ్య నగరంలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు

  • ప్రైవేటు రంగంలోనూ రక్షణ, వైమానిక రంగాల హబ్‌గా నగరం

  • పాక్‌తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి బీఎండీ విస్తరణ!

న్యూఢిల్లీ, జూన్‌ 20: దేశ రక్షణలో కీలకమైన ‘ఖండాంతర క్షిపణి రక్షణ’ (బీఎండీ) వ్యవస్థను హైదరాబాద్‌కు కూడా విస్తరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. యుద్ధం సందర్భంగా.. హైదరాబాద్‌ లక్ష్యంగా పాకిస్థాన్‌ ఓ క్షిపణిని ప్రయోగించిందని, మన సైన్యం ఆ క్షిపణిని హరియాణా సమీపంలోనే కూల్చీ వేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్‌లో డీఆర్‌డీఓతోపాటు పలు ప్రభుత్వ రక్షణ రంగ పరిశోధన సంస్థలు, ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలోనూ ఢిఫెన్స్‌, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాధాన్యత దృష్ట్యానే బీఎండీ రక్షణను హైదరాబాద్‌కు కూడా కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో హైదరాబాద్‌తోపాటు బెంగళూరు కూడా పలు ప్రభుత్వ రక్షణ సంస్థలకు నిలయంగా ఉంది.

ముఖ్యంగా, వైమానిక రంగ పరిశోధన సంస్థలు ఆ నగరంలో ఉన్నాయి. మరోవైపు, తమిళనాడు రాజధాని చెన్నై.. దేశ రక్షణ పరంగా కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై మహానగరాలకూ బీఎండీని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలకు శత్రుదేశాల క్షిపణి దాడుల నుంచి పూర్తి రక్షణ కల్పించటం లక్ష్యంగా బీఎండీని డీఆర్‌డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఖండాంతర క్షిపణులు ముఖ్యంగా పాకిస్థాన్‌ షహీన్‌ దీర్ఘశ్రేణి క్షిపణులను అడ్డుకోవటానికి ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. భారత్‌ అమ్ముల పొదిలో కీలకమైన ఆయుధంగా మారిన బీఎండీ తొలి దశ.. అమలుకు సిద్ధంగా ఉంది. పాకిస్థాన్‌తో ఇటీవలి యుద్ధం నేపథ్యంలో బీఎండీని ఢిల్లీ, ముంబైలకే పరిమితం చేయకుండా దక్షిణాదికి ముఖ్యంగా హైదరాబాద్‌కూ విస్తరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే హైదరాబాద్‌ రక్షణ మరింత పటిష్ఠమవుతుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 05:37 AM