Nuclear Power Production: అణు ఇంధన రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు.. ప్రధాని కీలక ప్రసంగం
ABN, Publish Date - Aug 15 , 2025 | 02:09 PM
ప్రధాని నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో కీలక ప్రసంగం చేశారు. దేశం పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన విషయాన్ని నొక్కి చెప్పారు. ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో కీలక ప్రసంగం చేశారు. దేశం పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన విషయాన్ని నొక్కి చెప్పారు. ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. అణు ఇంధన రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు (Nuclear power production).
అణు విద్యుత్తుకు అవసరమైన యురేనియం (Uranium)ను తవ్వడానికి, దిగుమతి చేసుకోవడానికి, ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ సంస్థలను (Private Firms) అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2047 నాటికి అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 రెట్లు పెంచాలని యోచిస్తోంది. అలా జరిగితే భారతదేశ మొత్తం విద్యుత్ అవసరాలలో 5% అణు విద్యుత్తు ద్వారా తీరుతుంది. అణు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన నియంత్రణ వ్యవస్థ పరికరాలను సరఫరా చేయడానికి ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తారట.
ప్రభుత్వ డేటా ప్రకారం.. భారతదేశంలో 76, 000 టన్నుల యురేనియం ఉందని అంచనా. ఇది 30 సంవత్సరాల పాటు 10,000 మెగావాట్ల అణు విద్యుత్తుకు ఇంధనంగా సరిపోతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
'ఇంధనం విషయంలో దేశం ఎంతో ప్రగతి సాధించాలి. సోలార్, గ్రీన్ హైడ్రోజన్ వైపు నడవాల్సి ఉంది. అణు ఇంధనంపై కూడా దృష్టి సారించి వేగంగా అడుగులు వేయాలి. అణు విద్యుత్తులో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తాం. పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల సహాయంతో దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఆ దిగుమతులు తగ్గితే స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. నేడు ప్రపంచమంతా ఖనిజాల గురించే ఆలోచిస్తోంది' అని తాజాగా ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
దేశ్ రంగీల పాటకు రిహార్సల్స్.. డ్యాన్స్ అదరగొట్టిన ఉపాధ్యాయుడు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 15 , 2025 | 02:09 PM