ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Railway Jobs Scam: రైల్వే జాబ్స్ స్కాం.. పలువురు అధికారులపై సీబీఐ కేసు

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:41 PM

రైల్వే ఉద్యోగాల విషయంలో మరో స్కాం బయటపడింది. విషయం తెలుసుకున్న సీబీఐ, రంగంలోకి దిగి పలువురు అధికారులను అరెస్ట్ చేసింది. దీంతోపాటు ఈ కేసులో ఎంత మంది ఉన్నారనే విషయాలను కూడా ఆరా తీస్తోంది.

Railway Jobs Scam

రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా మరో స్కాం (Railway Jobs Scam) వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంలో రైల్వే ఉద్యోగాలతోపాటు ప్రధానంగా డిపార్ట్‌మెంటల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి లంచం తీసుకున్న కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో ఇప్పటికే సీబీఐ అనేక మంది రైల్వే అధికారులపై కేసు నమోదు చేసింది.

వీటిలో వడోదర, ముంబై సహా ఇతర ప్రాంతాల రైల్వే అధికారులపై కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులో అంకుష్ వాసన్ (IRPS, వెస్ట్రన్ రైల్వే, వడోదర), సంజయ్ కుమార్ తివారీ (డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, చర్చ్‌గేట్, వెస్ట్రన్ రైల్వే, ముంబై), నీరజ్ సిన్హా (డిప్యూటీ సూపరింటెండెంట్), ముఖేష్ మీనా వంటి పలువురు రైల్వే అధికారుల పేర్లు బయటకొచ్చాయి. వీరు ఉత్తీర్ణత సాధించేందుకు అనేక మంది నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు తేలింది.


10 మంది అభ్యర్థులు..

ఈ క్రమంలోనే సీబీఐకి అందిన సమాచారం ప్రకారం 10 మంది అభ్యర్థులు లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న క్రమంలో వారిని పట్టుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి వీరు రూ. 4 నుంచి 5 లక్షల మేరకు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లావాదేవీలు నగదులో కాకుండా బంగారంలో జరగడం విశేషం. ఆ క్రమంలో వారికి సంబంధించిన లావాదేవీ రికార్డులు కూడా ఉంచుకోకుండా పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ రైల్వే నిర్వహించనున్న కమిటీ డిపార్ట్‌మెంట్ పరీక్షలో ఎంపిక కోసం లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న 10 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని అంకుష్ వాసన్.. సంజయ్ కుమార్ తివారీని ఆదేశించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.


ఇప్పటికే ఐదుగురు..

ముఖేష్ మీనాతో టచ్‌లో ఉండి, అలాంటి అభ్యర్థులు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో కనుక్కోమని, తద్వారా వారి నుంచి డబ్బు తీసుకోవచ్చని అంకుష్ సంజయ్‌తో చెప్పాడు. ఆ తరువాత సంజయ్ కుమార్ తివారీ ఆసక్తిగల అభ్యర్థుల గురించి ముఖేష్ మీనా నుంచి సమాచారాన్ని సేకరించాడు. ఈ కేసులో ముఖేష్ మీనా తాను ఇప్పటికే ఐదుగురు అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత వారు వసూలు చేసిన లంచాన్ని ముఖేష్ మీనా నేరుగా SK తివారీకి అందజేస్తామన్నారు. ఆ తర్వాత అంకుష్ వాసన్, ఎస్కే తివారీ మధ్య దీనిపై చర్చ జరిగేది.


ఈ కేసుకు సంబంధించి..

ఈ కుంభకోణంలో నేరం చేసినట్లు అధికారులు ఒప్పుకోవడంతో సీబీఐ ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని అధికారుల నుంచి రాబడుతోంది. ఈ స్కాంలో కేవలం రైల్వే అధికారులే కాకుండా, విభిన్న రైల్వే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భాగస్వామ్యులు కావచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రైల్వే శాఖలో భవిష్యత్తు నియామకాలు మరింత జాగ్రత్తలు చేయాలని కోరుతున్నారు. నిజాయితీతో రైల్వే నియామకాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. దేశంలో ఇదివరకు కూడా బిహార్ రాష్ట్రంలో రైల్వే ఉద్యోగాల స్కాం వెలుగులోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 04:44 PM