ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Bharat Tickets: గుడ్ న్యూస్.. వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు

ABN, Publish Date - Aug 05 , 2025 | 09:40 AM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యం అయినా, ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టికెట్ గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఎలా అంటే..

Vande Bharat Tickets

ఇంటర్నెట్ డెస్క్‌: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యం అయినా, ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టికెట్ గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఎలా అంటే.. ఇకపై మీరు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే, మీరు మళ్లీ మధ్యలో ఎక్కడైనా ఎక్కాలన్నా, టికెట్ ఈజీగా దొరుకుతుంది. టికెట్ ముందుగా బుక్ చేయకపోయినా, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు రియల్ టైమ్‌లో చూసి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఈ సౌకర్యం దక్షిణ రైల్వే (South Railway) కింద నడిచే 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి.

8 వందే భారత్ రైళ్లు ఏవీ?

  • 20631 మంగళూరు సెంట్రల్ - తిరువనంతపురం సెంట్రల్

  • 20632 తిరువనంతపురం సెంట్రల్ - మంగళూరు సెంట్రల్

  • 20627 చెన్నై ఎగ్మోర్ - నాగర్‌కోయిల్

  • 20628 నాగర్‌కోయిల్ - చెన్నై ఎగ్మోర్

  • 20642 కోయంబత్తూరు - బెంగళూరు కాంట్.

  • 20646 మంగళూరు సెంట్రల్ - మడ్గావ్

  • 20671 మధురై - బెంగళూరు కాంట్.

  • 20677 డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - విజయవాడ

హడావుడిగా తీసుకున్న ప్రయాణాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో లేదా తక్కువ నోటీసుతో ప్లాన్ చేసిన ట్రిప్స్‌కి ఇది సహాయం చేస్తుంది. చిన్న పట్టణాల నుంచి ఎక్కే ప్రయాణికులకు కూడా టికెట్ దొరకే అవకాశం పెరిగింది. రైళ్ల టికెట్ సిస్టమ్‌ను (PRS) అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు రియల్ టైమ్‌లో ఖాళీ సీట్లు కనిపిస్తాయి. అలా చూసి మీరు 15 నిమిషాల ముందు వరకూ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Also Read:

ఈ ఫొటోలో ఉన్న మొత్తం జంతువులను 25 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందే..

వర్షాకాలం..ఉతికిన బట్టలు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ మర్చిపోకండి.!

For More Latest News

Updated Date - Aug 05 , 2025 | 09:42 AM