MSP Increase: ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచారంటే..
ABN, Publish Date - May 28 , 2025 | 05:17 PM
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ ఆమోదం తెలిపింది. పెంచిన రేట్లు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 28: కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ ఆమోదం తెలిపింది. పెంచిన రేట్లు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశ సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు ఎంఎస్‌పీని నిర్ణయించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయపరమైన పరిహారం పొందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీని పెంచడం జరిగిందని కేబినెట్ పేర్కొంది. అన్ని పంటలలో వలిసెలకు ఎక్కువ ఎంఎస్‌పీని పెంచారు. క్వింటాలుకు రూ. 820 కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఏ పంటకు ఎంత ఎంఎస్‌పీ పెంచారో ఇప్పుడు చూద్దాం..
వరి సాధారణ, గ్రేడ్ ఏకి క్వింటాలు 69 రూ పెంపు.
జొన్నలు క్వింటా రూ. 328 పెంపు.
సజ్జలు క్వింటా రూ.150 పెంపు.
రాగులు క్వింటా రూ.596 పెంపు.
మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు.
కందిపప్పు క్వింటా రూ.450 పెంపు.
పెసర్లు క్వింటా రూ.86 పెంపు.
మినుములు క్వింటా రూ.400 పెంపు.
వేరుసెనగ క్వింటా రూ.480 పెంపు.
పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు.
సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు.
కుసుములు క్వింటా రూ.579 పెంపు.
వలిసెలు క్వింటా రూ.820 పెంపు.
పత్తి క్వింటా రూ.589 పెంపు.
సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర నిర్ణయించారు.
Also Read:
కోహ్లీని రెచ్చగొట్టాడు.. ఎవడ్రా వీడు!
రేపు ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్
For More National News and Telugu News..
Updated Date - May 28 , 2025 | 05:17 PM