ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: మరణిస్తూ.. ఐదుగురికి కొత్త జీవితం

ABN, Publish Date - Jun 09 , 2025 | 06:09 AM

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

  • బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాల సేకరణ

  • ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా ఢిల్లీకి కిడ్నీ, కార్నియా తరలింపు

బెంగళూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరులోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో అతని అవయవాలను సేకరించి, ఐదుగురికి జీవితం ప్రసాదించారు. ఓ కిడ్నీ, కార్నియాను ఢిల్లీలోని మిలిటరీ ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా తరలించారు. మరో మూత్రపిండం, కార్నియా, స్కిన్‌ కోయిలాను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బీజీఎస్‌ గ్లెనిగల్‌ ఆస్పత్రికి కాలేయాన్ని తరలించారు. జీవన సార్థకత కర్ణాటక సంస్థ సహకారంతో అవయవాలు అవసరమైన వారికి అందించే కార్యక్రమం పూర్తి చేశారు.

Updated Date - Jun 09 , 2025 | 06:11 AM