BJP: విద్యారంగం అభివృద్ధిలో డీఎంకే ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Jun 11 , 2025 | 10:59 AM
ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి ప్రకటనలపై వున్న శ్రద్ధ విద్యారంగం పట్ల లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు. ఆయన మంగళవారం తన ఎక్స్‌పేజీలో అర్హులైన సెకండ్ గ్రేడ్ టీచర్లకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
- బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి ప్రకటనలపై వున్న శ్రద్ధ విద్యారంగం పట్ల లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(Nayinar Nagendhar) విమర్శించారు. ఆయన మంగళవారం తన ఎక్స్‌పేజీలో అర్హులైన సెకండ్ గ్రేడ్ టీచర్లకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలేదని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గతులు లేవని పలు ప్రాంతాల్లో విద్యార్థులే మరుగుదొడ్లు శుభ్రంచేసే పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 20వేలకు పైగా ఖాళీ అయిన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
అలాగే ఉపకులపతుల నియామకంలో నిర్లక్ష్యంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. టీచర్ ఎంపిక బోర్డు ద్వారా 19,260 పోస్టులను 18 నెలల వ్యవధిలో భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన హామీని సీఎం స్టాలిన్ అమలుపరచకుండా విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News
Updated Date - Jun 11 , 2025 | 11:06 AM