ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: న్యూజిలాండ్ జనాభాకు మించి బిహార్‌కు ఇళ్లిచ్చాం: మోదీ

ABN, Publish Date - Jul 18 , 2025 | 03:22 PM

గ్లోబల్‌ డవలప్‌మెంట్‌లో తూర్పు దేశాలు ఏవిధంగా అడ్వాన్స్ అవుతున్నాయో, ఇండియాలోనూ తూర్పు రాష్ట్రాల శకం నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Narendra Modi

మోతిహారి: బిహార్‌ సర్వతోముఖాబివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. మోతిహారిలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడూతూ, ఈరోజు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో ఉన్న జనాభాకు మించి బిహార్ ప్రజలకు ఇళ్లు ఇచ్చామని తెలిపారు.

'ఇది చంపారణ్ చారిత్రక గడ్డ. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇక్కడి నుంచే గాంధీజీ ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించారు. ఆ స్ఫూర్తితోనే ఇక్కడి నుంచి బిహార్‌కు సరికొత్త భవిష్యత్తును నిర్దేశించనున్నాం' అని మోదీ అన్నారు. ప్రపంచం వేగంగా 21వ శాతాబ్దంలోకి దూసుకు వెళ్తోందని, ఒకప్పుడు అధికారం పాశ్చాత్య దేశాల చేతుల్లోనే ఉండేదని, ప్రస్తుతం తూర్పు దేశాల ఆధిపత్యం, పార్టిషిపేషన్ పెరిగిందని చెప్పారు. తూర్పు దేశాలు వేగవంతమైన అభివృద్ధిని అందిపుచ్చుకున్నాయని తెలిపారు. గ్లోబల్‌ డవలప్‌మెంట్‌లో తూర్పు దేశాలు ఏవిధంగా అడ్వాన్స్ అవుతున్నాయో, ఇండియాలోనూ తూర్పు రాష్ట్రాల శకం నడుస్తోందని అన్నారు.

3.5 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు

బీహార్‌లో 3.5 కోట్ల మందికి పైగా మహిళలకు బ్యాంకు అకౌంట్లు కల్పించామని, గత 1.5 ఏళ్లలో రాష్ట్రంలోని 24,000కు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.1000 కోట్లు సాయం అందించామని చెప్పారు. ప్రస్తుతం 20కి పైగా లక్‌పతి దీదీలు బిహార్‌లో ఉన్నారని అన్నారు.

ముంబై తరహాలో పాట్నా

రాబోయే రోజుల్లా పశ్చిమ భారతదేశంలో మోతిహారి పేరు మారుమోగుతుందని, గురుగ్రామ్‌ తరహాలోనే గయలోనూ అవకాశాల కల్పన జరుగుతుందని, పుణె తరహాలో పాట్నాలోనూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ప్రధాని చెప్పారు. సూరత్ లాగానే సంథాల్ పరగణ కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. జైపూర్ తరహాలో జల్‌పాయ్‌గురిలో టూరిజం అభివృద్ధి జరుగుతుందని, బెంగళూరులా బీర్‌భూమ్ ప్రగతి సాధిస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రధాని తన పర్యనలో భాగంగా బిహార్‌లో రూ,7,200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పలు రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరుగనున్నాయి. అయితే అధికారికంగా ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించాల్సి ఉంది. బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ తిరిగి ఎన్డీయా కూటమిగా పోటీ చేస్తుండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమి భాగస్వాములుగా పోటీ చేస్తు్న్నాయి, 243 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం ఎన్డీయేకు 131 మంది సభ్యులున్నాయి. బీజేపీకి 80, జేడీయూకు 45, హెచ్ఏఎం(ఎస్)కు నలుగురు సభ్యులు ఉన్నాయి. 12 మంది ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమికి 111 మంది సభ్యులుండగా, ఆర్జేడీకి 77 మంది, కాంగ్రెస్‌కు 19, సీపీఐ (ఎంఎల్)కు 111, సీపీఎంకు ఇద్దరు, సీపీఐకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్

ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:35 PM