ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: 7 రాష్ట్రాలు, 2 యూటీలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

ABN, Publish Date - Jul 02 , 2025 | 06:22 PM

ఇంతవరకూ 28 రాష్ట్రాల్లో బీజేపీ అంతర్గత సంస్థాగత ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి.

న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇందులో భాగంగా 7 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ అధ్యక్షులను బీజేపీ నియమించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కు కొత్త అధ్యక్షులను నియమించింది.

బీజేపీ సంఘటన్ పర్వ్ (ఆర్గనైజేషనల్ డ్రైవ్) రెండో దశలో భాగంగా మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇంతవరకూ 28 రాష్ట్రాల్లో విజయవంతంగా అంతర్గత సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా వంటి కీలక రాష్ట్రాల్లో ఇంటర్నల్ ఎలక్షన్ పూర్తికాగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొత్తగా ఎన్నికైన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరే

1.మధ్యప్రదేశ్ - హేంత్ ఖండేల్వాల్

2.మహారాష్ట్ర - రవీంద్ర చవాన్

3.తెలంగాణ - ఎన్.రామచంద్రరావు

4.ఆంధ్రప్రదేశ్ - పీవీఎన్ మాధవ్

5.ఉత్తరాఖండ్ - మహేంద్ర భట్

6.హిమాచల్ ప్రదేస్ - రాజీవ్ బిందాల్

7.పుదుచ్చేరి - వీపీ రామలింగం

8.మిజోరం - బిచువా

9.అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ - అనిల్ తివారీ

ఇవి కూడా చదవండి..

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 06:28 PM