Bike taxi: బైక్ ట్యాక్సీ సేవలకు కేంద్రం ఓకే..
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:33 PM
బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ అంటేనే ఒక పెద్ద చర్చ. ఆఫీసువేళల్లో రావాలన్నా పోవాలన్నా ఎంతసమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రజారవాణాలో బీఎంటీసీ బస్సులు, మెట్రోతోపాటు ఆటోలు, క్యాబ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
- వ్యతిరేకిస్తున్న ఆటో, ట్యాక్సీడ్రైవర్లు
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఉత్కంఠ
బెంగళూరు: బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ అంటేనే ఒక పెద్ద చర్చ. ఆఫీసువేళల్లో రావాలన్నా పోవాలన్నా ఎంతసమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రజారవాణాలో బీఎంటీసీ బస్సులు, మెట్రోతోపాటు ఆటోలు, క్యాబ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆటో, క్యాబ్ చార్జీలతో పోలిస్తే తక్కువ ధరకే బైక్‌ట్యాక్సీ(Bike taxi) సేవలు అందుబాటులో ఉన్నాయి. సొంత బైక్‌లపై సర్వీసు ఇస్తున్నారని,
తాము పలు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నామంటూ బైక్ ట్యాక్సీల వల్ల తమ ఉపాధి కోల్పోతోందంటూ పలు ఆటో సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సొంత ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా ఎలా అనుమతిస్తారని ఇది కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకమని హైకోర్టు సూచించడంతో జూన్ 16న రాష్ట్రపభ్రుత్వ బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేసింది. కాగా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ ఫుల్‌బెంచ్‌ను బైక్‌సేవల సంస్థలు ఆశ్రయించాయి.
- ఈ నేపథ్యంలో బైక్ ట్యాక్సీ యాప్ సేవలందిస్తున్న ర్యాపిడో, ర్యాపిడో తదితర సంస్థలు అందుకు నిబంధనలు ఉంటే వాటిని పాటిస్తామంటూ తమ అభ్యంతరం వ్యక్తం చేశాయి. బైక్ ట్యాక్సీ సేవలు బెంగళూరుతోపాటు మైసూరు, మండ్య, దావణగెరె, రామనగర తదితర నగరాలలో ఉన్నాయి. బైక్ ట్యాక్సీసేవలలో అత్యధికంగా యువత ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉపాధి కోల్పోతుందని పలుమార్లు నిరసన తెలిపారు. 2021లో ప్రారంభమైన ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీసేవలను మహిళల సురక్షత, చట్టాల లోపాల నేపథ్యంలో 2024లో రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.
కాగా కేంద్రప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మంగళవారం పలు మార్గదర్శకాలు చేసింది. ప్రైవేట్ బైక్‌లను ప్రయాణీకుల సంచారానికి ఉపయోగించాలంటే అగ్రిగేటర్‌లు రాష్ట్రప్రభుత్వాల అనుమతి పొందాల్సి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య నియంత్రణ, ధర నిర్ణయం, స్థానికులకు రవాణా సదుపాయ అవకాశాలు ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు మోటారు వాహనాల సెక్షన్ 67 సబ్ సెక్షన్ (3) కింద అగ్రిగేటర్‌లకు ప్రైవేట్ వాహనాలకు ప్రయాణీకుల సంచారానికి అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకుగాను అగ్రిగేటర్‌ల నుంచి రోజువారీ, వారపు, పదిహేను రోజులకోసారి ట్యాక్స్ పన్ను విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News
Updated Date - Jul 03 , 2025 | 01:33 PM