ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Waterfall: మహిళలకు తృటిలో తప్పిన ముప్పు.. జలపాతంలో నీరు ఒక్కసారిగా ఉప్పొంగడంతో..

ABN, Publish Date - Jun 30 , 2025 | 05:17 PM

జలపాతం చూసేందుకు వెళ్లిన కొందరు మహిళలకు తృటిలో ప్రమాదం తప్పింది. నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోతున్న వారిని స్థానికులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Bihar Waterfall Rescue Video

ఇంటర్నెట్ డెస్క్: జలపాతం చూసేందుకు వెళ్లిన ఆరుగురు మహిళలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో కాలు జారీ కొట్టుకుపోయిన వారంతా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. బిహార్‌ రాష్ట్రం గయ జిల్లాలో గల లంగూరియా జలపాతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Bihar waterfall rescue video).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, జలపాతం చూసేందుకు వెళ్లిన ఆరుగురు మహిళలు నీటిలోకి దిగారు. ఆ తరువాత కొన్ని క్షణాలకే నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన ఓ మహిళ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే మిగతా వారూ వడివడిగా ఒడ్డుకు వచ్చేందుకు ట్రై చేశారు.

ఇంతలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ముగ్గురు మహిళలు దిగువకు కొట్టుకుపోయారు. ఈ షాకింగ్ దృశ్యాలు చూసి చుట్టుపక్కల వారు పెద్దఎత్తున హాహాకారాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తం కావడంతో తృటిలో వారికి పెను ప్రమాదం తప్పింది. మహిళలు జలపాతం నుంచి కిందపడే లోపే స్థానికులు వారిని ఒడ్డుకు లాగారు.

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జలపాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు హెచ్చరించారు. ముఖ్యంగా వానాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. కొండలపై నుంచి వచ్చే నీటి శక్తి ఎక్కువగా ఉంటుందని, వానాకాలంలో జలపాతాల జోలికెళ్లడం అంత క్షేమం కాదని స్పష్టం చేశారు. నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

ఇవీ చదవండి:

మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్

ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 06:20 PM