Businessman Murder Case: వ్యాపారవేత్త హత్య కేసులో బిగ్ అప్డేట్..
ABN, Publish Date - Jul 08 , 2025 | 10:09 AM
బిహార్ వ్యాపారవేత్త హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితుడు ఎన్‌కౌంటర్ అయ్యాడు.
Bihar Businessman Murder Case: బిహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు కాల్పులు జరపడంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితుడు వికాస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
గోపాల్ హత్య కేసులో సిట్ బృందం దర్యాప్తు చేపట్టగా ఈ క్రమంలోనే పట్నాలోని ఓ ప్రాంతంలో పోలీసులను చూసిన నిందితుడు వికాస్ వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితుడు వికాస్ మరణించారు. గోపాల్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కాగా, గోపాల్ ఖేమ్కా కుమారుడు కూడా హాజీపూర్‌లో ఏడు సంవత్సరాల క్రితం ఒక భూ వివాదం కారణంగా హత్యకు గురయ్యాడు.
ఈ హత్యపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతీశ్‌కుమార్ పాలనలో బిహార్ రాష్ట్రం నేర రాజధానిగా మారిందని నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని దుయ్యబట్టారు. బీహార్ శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి.
Also Read:
ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే..
For More National News
Updated Date - Jul 08 , 2025 | 10:39 AM