Share News

Saudi Arabia: సౌదీలో గతేడాది 345 మందికి ఉరి

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:01 AM

సౌదీ అరేబియాలో గత ఏడాది విధించిన మరణశిక్షల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సోమవారం పేర్కొంది. 2024లో సౌదీలో ఏకంగా 345 మందిని ఉరితీయగా..

Saudi Arabia: సౌదీలో గతేడాది 345 మందికి ఉరి

దుబాయ్‌, జూలై 7: సౌదీ అరేబియాలో గత ఏడాది విధించిన మరణశిక్షల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సోమవారం పేర్కొంది. 2024లో సౌదీలో ఏకంగా 345 మందిని ఉరితీయగా.. తమ రికార్డుల ప్రకారం ఈ సంఖ్య గత మూడు దశాబ్దాలకు పైగా కాలంలోనే అత్యధికమని వెల్లడించింది.


మాదకద్రవ్యాల కేసుల్లో శిక్షలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ సంవత్సరం కూడా మొదటి ఆరు నెలల కాలంలోనే 180 మందికి మరణశిక్ష విధించారని, గత రికార్డును ఈ ఏడాది అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలతో పాటు ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - Jul 08 , 2025 | 06:01 AM