ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajdhani Express: రెండు రైళ్లను పట్టాలు తప్పించే ప్రయత్నం.. లోకోపైలట్ల అప్రమత్తతో తప్పిన ప్రమాదం

ABN, Publish Date - May 20 , 2025 | 03:24 PM

పోలీసుల సమాచారం ప్రకారం, దలేల్‌నగర్, ఉమర్‌తాలి స్టేషన్ల మధ్య పట్టాలకు సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్తింగ్ వైర్‌ను ఉపయోగించి చెక్క పలకలు కట్టారు. ఢిల్లీ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (20504) లోకో పైలట్ సకాలంలో ట్రాక్‌పై అడ్డంకులు ఉన్నట్టు గ్రహించి అత్యవసర బ్రేకులు వేశారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani Express)తో పాటు మరో రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు చేసిన కుట్ర విఫలమైంది. లోకో పైలట్ల అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.

Operation Sindoor: పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్


పోలీసుల సమాచారం ప్రకారం, దలేల్‌నగర్, ఉమర్‌తాలి స్టేషన్ల మధ్య పట్టాలకు సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్తింగ్ వైర్‌ను ఉపయోగించి చెక్క పలకలు కట్టారు. ఢిల్లీ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (20504) లోకో పైలట్ సకాలంలో ట్రాక్‌పై అడ్డంకులు ఉన్నట్టు గ్రహించి అత్యవసర బ్రేకులు వేశారు. రైలు ఆగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, కాఠ్‌గోదామ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా పట్టాలు తప్పిచేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అయితే లోకో‌పైలెట్ సకాలంలో దీనిని గుర్తించడంతో ప్రమాదం తప్పింది.


కాగా, ఈ రెండు ఘటనల అనంతరం జీఆర్‌పీ, ఆర్‌పీ టీమ్‌లు, మెయింటెనెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నాయి. ట్రాక్‌లను క్లియర్ చేయడంతో యథాప్రకారం రైళ్ల రాకపోకలు కొనసాగాయి. ఏప్రిల్ 16వ తేదీన ఢిల్లీకి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా తృటిలో ప్రమాదం తప్పింది. లక్నోలోని మలిహాబాద్ రైల్వే ట్రాక్‌పై ఉంచిన మామిడి చెట్టు కొమ్మను రైలు ఢీకొంది.


ఇవి కూడా చదవండి..

Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 03:25 PM