Bharat Bandh: భారత్ బంద్.. ఎప్పుడంటే.. ?
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:47 PM
రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలు ట్రేడ్ యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులోభాగంగా బుదవారం అంటే.. జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు నిచ్చాయి.
న్యూఢిల్లీ, జులై 08: కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బుధవారం అంటే.. జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా బంద్‌కు ట్రేడ్ యూనియన్ సంస్థలు పిలుపు నిచ్చాయి. దీంతో బుధవారం భారత్ బంద్ జరగనుంది. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూత బడనున్నాయి. బ్యాంకింగ్, పోస్టల్, మైనింగ్, నిర్మాణ రంగాలతోపాటు రవాణా సంస్థల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ బంద్ కారణంగా.. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు.. తమ విధులకు దూరంగా ఉండనున్నారు. ఇక పలు ప్రభుత్వ సేవలు, పాఠశాలలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు తెరిచి ఉంచనున్నారు. కార్మికులు, రైతులకు అనుబంధంగా పని చేస్తున్న వివిధ కేంద్ర ట్రేడ్ యూనియన్ సంస్థలు ఈ భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి.
దేశవ్యాప్తంగా జరగనున్న ఈ ఆందోళనలో రైతులతోపాటు గ్రామీణ కార్మికులు పాల్గొనున్నారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అరమ్‌జిత్ కౌర్ వెల్లడించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన విధానాల నేపథ్యంలో వారు ఈ ఆందోళనలో పాల్గొనున్నారని వివరించారు.
ఈ బంద్‌కు పిలుపు ఎందుకంటే..
కొత్తగా తీసుకు వచ్చిన నాలుగు చట్టాల వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిరుద్యోగంతోపాటు ద్రవ్యోల్బణం పెరగడం.
ఆరోగ్యం, విద్య, పౌర సేవలను తగ్గించడం
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే అవుతున్నారు కానీ.. ఆ స్థానంలో యువతను విధుల్లో చేర్చుకోకపోవడం.
గత పదేళ్లుగా కార్మిక సదస్సులు నిర్వహించకపోవడం
పబ్లిక్ సెక్యూరిటీ బిల్లులను పక్కన పెట్టేయడం తదితర సమస్యలు కారణంగా ఈ బంద్‌కు పిలుపు నిచ్చారు.
యూనియన్లు మద్దతు..
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ)
హిందూ మజుదూర్ సభ (హెచ్‌ఎమ్ఎస్)
సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎస్‌ఈడబ్ల్యూఏ)
లేబర్ ప్రోగ్రసీవ్ ఫెడరేషన్ (ఎల్‌పీఎఫ్)
యూనియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటీయూసీ)
ఇవి కూడా చదవండి..
ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 08 , 2025 | 04:49 PM