Childhood Friend: 30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని
ABN, Publish Date - Aug 13 , 2025 | 10:56 AM
Childhood Friend: విజయ్ భార్యను తీసుకుని మాచోహళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ధనుంజయ్, ఆశల సంబంధం మాత్రం ఆగలేదు. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు.
ఆ ఇద్దరిదీ చిన్ననాటి స్నేహం. 30 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అలాంటి వారి స్నేహంలో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది. ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని 30 ఏళ్ల స్నేహ బంధానికి రక్తంతో వీడ్కోలు పలికాడు. ఫ్రెండ్‌ను అతడి భార్యతో కలిసి హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల విజయ్ కుమార్, ధనుంజయ్ చిన్ననాటినుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ మగది ఏరియాలోనే పెరిగి పెద్దవారయ్యారు. విజయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి పదేళ్ల క్రితం ఆశతో పెళ్లయింది. ఈ జంట కొన్ని నెలల క్రితం వరకు కామాక్షిపాళ్యలో ఉండేది. తన స్నేహితుడు ధనుంజయ్, ఆశ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని విజయ్‌కి కొన్ని నెలల క్రితమే తెలిసింది. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
ఇద్దరినీ నిలదీశాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని మాచోహళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ధనుంజయ్, ఆశల సంబంధం మాత్రం ఆగలేదు. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. పక్కా ప్లాన్‌తో అతడ్ని చంపేశారు. విజయ్ శవాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ధనుంజయ్, ఆశల వ్యవహారం బయటపడింది. ఆశను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ధనుంజయ్ కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కారులో కూర్చుని డబ్బులు పంచిన ఎంపీ.. ఎగబడ్డ జనం..
కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ ఆగ్రహం
Updated Date - Aug 13 , 2025 | 11:05 AM