Ban Turkey: పాకిస్తాన్‌కు సహాయం.. టర్కీకి వందల కోట్ల రూపాయల నష్టం
ABN, Publish Date - May 13 , 2025 | 05:20 PM
పహల్గామ్‌లోని ఉగ్రదాడిని మెజారిటీ దేశాలు ఖండించాయి. అయితే అలాంటి ఉగ్రదాడిపై కూడా సానుభూతి చూపకుండా పాకిస్తాన్‌కు టర్కీ గుడ్డిగా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్‌కు ఎర్డోగాన్ ప్రభుత్వం డ్రోన్‌లను కూడా అందించింది. ఆ డ్రోన్లతోనే భారత్‌పై పాకిస్తాన్ దాడికి దిగింది. సామాన్య పౌరులకు నష్టం కలిగించింది.
పెహల్గామ్‌లోని జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operaion Sindoor)ను చేపట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. పహల్గామ్‌లోని ఉగ్రదాడిని మెజారిటీ దేశాలు ఖండించాయి. అయితే అలాంటి ఉగ్రదాడిపై కూడా సానుభూతి చూపకుండా పాకిస్తాన్‌కు టర్కీ (Turkey) గుడ్డిగా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్‌కు ఎర్డోగాన్ ప్రభుత్వం డ్రోన్‌లను, సైనిక విమానాలను, యుద్ధనౌకను కూడా అందించింది. ఆ డ్రోన్లతోనే భారత్‌పై పాకిస్తాన్ దాడికి దిగింది. సామాన్య పౌరులకు నష్టం కలిగించింది (boycott Turky).
ఉద్రిక్తతల వేళ టర్కీ వ్యవహరించిన తీరుతో మనదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సోషల్ మీడియాలో ``బ్యాన్ టర్కీ``, ``బాయ్‌కాట్ టర్కీ`` నినాదాలు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. టర్కీ నుంచి మనదేశానికి యాపిల్స్ ఎగుమతి అవుతుంటాయి. మనదేశానికి యాపిల్స్ (Turkish Apples) ఎగుమతుల ద్వారా టర్కీ ఒక సీజన్‌కు దాదాపు రూ.1200 కోట్లు ఆర్జిస్తుంది. అలాగే టర్కీకి అధికంగా వెళ్లే టూరిస్ట్‌లలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. టర్కీకి యాపిల్స్ ఎగుమతి, టూరిజం ద్వారానే అధిక సంపద చేకూరుతుంది. అందులో భారత్‌ది మెజారిటీ వాటా.
పాకిస్తాన్‌కు సహాయం చేసిందనే కారణంతే ఆ దేశ ఉత్పత్తులను కొనేందుకు మన దేశ వ్యాపారలు ఇష్టపడడం లేదు. టర్కీ నుంచి యాపిల్స్ కొనడం ఆపేస్తున్నామని పుణెలోని యాపిల్ ట్రేడర్స్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి ఇకపై యాపిల్స్ కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది, ఆర్థికంగా నష్టం కలిగించే నిర్ణయమే అయినా, దేశానికి, సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 13 , 2025 | 05:24 PM