ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah: పాక్‌ గొంతు ఎండాల్సిందే!

ABN, Publish Date - Jun 22 , 2025 | 06:13 AM

పాకిస్థాన్‌ గొంతు ఎండాల్సిందే. ఆ దేశం నీటి కొరతతో అల్లాడాల్సిందే. సింధు నది జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తే లేదు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు.

  • ‘సింధు జలాల’ ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించం: అమిత్‌ షా

న్యూఢిల్లీ, జూన్‌ 21: ‘‘పాకిస్థాన్‌ గొంతు ఎండాల్సిందే. ఆ దేశం నీటి కొరతతో అల్లాడాల్సిందే. సింధు నది జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తే లేదు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. అయితే, అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమన్న ఆయన.. వాటిని నిలిపి ఉంచే హక్కు భారత్‌కు ఉందని.. ఇప్పుడు తాము అదే చేశామని తెలిపారు. ‘‘ఇరు దేశాల శాంతి, అభివృద్ధి కోసమే 1960లో ఈ ఒప్పందం చేసుకున్నట్టు.. పీఠికలో స్పష్టంగా పేర్కొన్నారు.

కానీ, ఒకసారి దీనిని ఉల్లంఘిస్తే ఎవరూ కాపాడలేరు. పాకిస్థాన్‌ ఇప్పుడు ఆ పనే చేసింది. అందుకే ఆ దేశానికి తగిన శాస్తి జరగాలి.’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న జలాలను రాజస్థాన్‌కు మళ్లించనున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శలను షా కొట్టిపారేశారు.ఇతర పార్టీలను పక్కన పెడితే ఉగ్రవాదంపై తమను ప్రశ్నించే హక్కు కాంగ్రె్‌సకు ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పారు.

Updated Date - Jun 22 , 2025 | 06:13 AM