మినికాయ్ ద్వీపం నుంచి ఢిల్లీకి ఎగిరొచ్చిన అమీనా
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:13 AM
అమీనా మనీకా మినికాయ్ ద్వీపం నుంచి ఢిల్లీలోని మోదీతో భేటీ కావడానికి హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకుంది. ముద్రా యోజన ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించి ఈ ఘనత సాధించడానికి సహాయపడింది
కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో మోదీతో ముద్రా లబ్ధిదారు భేటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఆమె పేరు అమీనా మనీకా. టూరిజం, ట్రావెల్ మేనేజిమెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. రైల్ టెల్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని లక్షద్వీప్ లోని మినికాయ్ ద్వీపంలో హైస్పీడ్ ఫైబర్ టు హోమ్ ఇంటర్నెట్ సర్వీసులను ఇంటింటికీ అందించారు. ఇందుకు కొచ్చి-లక్షద్వీప్ ద్వీపంలోని సబ్‌మెరైన్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకున్నారు. మోదీ ముద్రా యోజన పథకం ద్వారా అందించిన ఆర్థిక సహాయంతోనే ఆమె ఈ కార్యక్రమాన్నంతటినీ నిర్వహించగలిగారు. ఈ ఘనత సాధించిన అమీనాను సత్కరించాలని కేంద్రం నిర్ణయించింది. సోమవారం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మూడు రోజుల కిందటే ఆమెకు ఆహ్వానం అందింది. కానీ.. లక్షద్వీప్ లోని మినికాయ్ ద్వీపం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు లేదు. దీంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన రామ్మోహన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో మినికాయ్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆమె అగత్తికి, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చి మోదీని కలిశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News
Updated Date - Apr 08 , 2025 | 05:13 AM