ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Accident First Video: ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో దృశ్యాలు..

ABN, Publish Date - Jun 12 , 2025 | 03:32 PM

అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ రోజు జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంచలనంగా మారింది. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానంలో 35 మందికిపైగా మృతి చెందిన ఘటన అనేక మందిని కలవర పరిచింది. ఈ క్రమంలో ప్రమాద స్థలం నుంచి వెలువడిన తొలి దృశ్యాలు (Air India Accident First Video) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Air India Accident First Video

గుజరాత్‌లోని (gujarat) అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉండగా, 35 మందికిపైగా మృతి చెందారని ఇప్పటివరకు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమాద స్థలం నుంచి మొదటి దృశ్యాలు (Air India Accident First Video) వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలలో విమానం కూలిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు రావడం కనిపిస్తుంది. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈ విమానం అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది.

విమానంలో 169 మంది ఇండియన్స్

అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు వెళ్తున్న AI171 విమానం ఈరోజు టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయిందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఇది మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, 7 మంది పోర్చుగీస్ పౌరులున్నారు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉండదని అక్కడి (SVPIA) ప్రతినిధి తెలిపారు. తర్వాత నోటీస్ వచ్చేవరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బాధితులకు సత్వర వైద్య సహాయం అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

నటి కల్పికకు ఊహించని షాక్..

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 04:14 PM