ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Plane Crash Incident: విమానం టేకాఫ్‌కు ముందే ఈ సమస్యలు కనిపించాయి.. ఆకాష్ సెన్సేషనల్ కామెంట్స్..

ABN, Publish Date - Jun 14 , 2025 | 10:24 AM

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే, విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికుడు ఆకాష్ వత్స ఒక వీడియో తీశాడు. అనంతరం, ఈ విమానం నుండి దిగిపోయాడు. అయితే, విమాన ప్రమాదాన్ని ఆకాష్ ముందుగానే గుర్తించాడా?

Ahmedabad Plane Crash Incident

Ahmedabad Plane Crash Incident: జూన్ 12న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు వచ్చిన ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన కేవలం కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం లక్కీగా బయటపడ్డాడు.

అయితే, ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికుడు ఆకాష్ వత్స ఒక వీడియో తీసి విమానం నుండి దిగిపోయాడు. ఈ వీడియోలో విమానంలో కొన్ని లోపాలు కనిపించాయని పేర్కొన్నాడు. విమానం టేకాఫ్ అయ్యే ముందు దాదాపు 15 నిమిషాలు రన్‌వేపై ఆగి ఉందని, విమానంలో ఏసీ పనిచేయడం లేదని, క్యాబిన్ సిబ్బందిని పిలవడానికి బటన్‌లు పనిచేయడం లేదని ఆకాష్ వివరించాడు.

విమానం ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు పెద్దగా ఎలాంటి సమస్యలు కనిపించలేదు. కానీ, అహ్మదాబాద్‌లోని విమానాశ్రయంలో విమానం ఆగినప్పుడు ఏసీ పని చేయకపోవడం అనుమానంగా అనిపించింది. విమానం క్రూజింగ్ సమయంలో ఫ్లాప్‌లు (విమానం వెనుక భాగాల్లో భాగాలు) సరిగ్గా పని చేయడం లేదని గమనించాను. ఈ విషయంపై నేను ఫిర్యాదు చేయాలని చూశాను, కానీ విమాన సిబ్బంది టేకాఫ్‌కు సిద్ధంగా ఉండటంతో వీలుకాలేదని ఆకాష్ చెప్పాడు. ప్రస్తుతం ఆకాష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే, విమాన సిబ్బందికి ఆకాష్ తను గమనించిన సమస్యలను వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని, ఇన్ని కుటుంబాలు ఇలా బాధపడుతూ ఉండేవి కాదని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read:

అహ్మదాబాద్ టూ ప‌హ‌ల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక ప్రమాదాలు..

15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..

For More National News

Updated Date - Jun 14 , 2025 | 02:42 PM